'నోటుకు పోటు' సక్సెస్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు : ఎస్. కె. బషీద్
Send us your feedback to audioarticles@vaarta.com
ఎస్ బి కె ఫిలిం కార్పొరేషన్ లో, ఎస్.కె బషీద్ దర్శకత్వంలో, ఎస్ కె కరీమున్నీసా నిర్మించిన చిత్రం “నోటుకు పోటు”. గత శనివారం విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టుకుంటోంది. ఈ చిత్రాన్ని ఇంత పెద్ద సక్సెస్ చేసిన సందర్భంగా దర్శకుడు ఎస్. కె. బషీద్ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మా 'నోటుకు పోటు' చిత్రాన్ని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ప్రేక్షకుల కోరిక మేరకు.ఈ వారం థియేటర్స్ కూడా పెంచుతున్నాము. మంచి కథ ఉంటే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని..ఈ చిత్రం తో మరోసారి తెలుసుకున్నాము. ఈ సక్సెస్ ఆనందం తో..మరిన్ని మంచి చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తామని తెలియచేస్తున్నాము...అని అన్నారు.
అర్జున్, మనీషా కొయిరాలా, శ్యామ్, అక్స బట్, సీతా, ఎ ఎమ్ ఆర్ రమేష్ తదితరులు ఈ చిత్రం లోని తారాగణం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com