'సైజ్ జీరో' తో కనెక్ట్ అవుతారట
Send us your feedback to audioarticles@vaarta.com
రెండేళ్ల క్రితం విడుదలైన'వర్ణ' కోసం తొలిసారిగా జతకట్టిన ఆర్య, అనుష్క.. మరోసారి 'సైజ్ జీరో' కోసం జోడీ కట్టిన సంగతి తెలిసిందే. ఈ నెల 27న ఈ సినిమా విడుదల కానుంది. విశేషమేమిటంటే.. ఈ రెండు సినిమాలనూ పి.వి.పి సంస్థ నిర్మించడం. అంతేకాదు.. రెండు సినిమాలు కూడా నవంబర్ నెలాఖరులోనే ప్రేక్షకుల ముందుకు రావడాన్ని టార్గెట్ చేసుకున్నాయి.
'వర్ణ'ది సోషియో ఫాంటసీ సబ్జెక్ట్ అయితే.. 'సైజ్ జీరో'ది పర్సనాలిటీకి సంబంధించిన సబ్జెక్ట్. 'వర్ణ'ని డిఫరెంట్ యాంగిల్‌లో ప్రజెంట్ చేయడంతో ఆడియన్స్ కనెక్ట్ కాలేకపోయారని.. 'సైజ్ జీరో' విషయంలో మాత్రం మెయిన్ పాయింట్తో ఆడియన్స్ ఇట్టే కనెక్ట్ అయిపోతారని చిత్ర యూనిట్ పేర్కొంటోంది. చూద్దాం.. ఏం జరుగుతుందో!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com