'సైజీజీరో' బంగారం కాంటెస్ట్
Send us your feedback to audioarticles@vaarta.com
అనుష్క, ఆర్య ప్రధానపాత్రల్లో ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో పివిపి బ్యానర్‌పై రూపొందిన చిత్రం సైజ్‌జీరో`. వెయిట్‌లాస్ అనే పాయింట్‌పై తెరకెక్కిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని నవంబర్ 27న విడుదలవుతుంది. కామెడి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ ,చిత్రాన్ని తెలుగు, తమిళంలో 1500 థియేటర్స్‌లో గ్రాండ్ లెవల్లో విడుదల చేయాలని యూనిట్ ప్లాన్ చేస్తుంది. విడుదల ముందుగా ఆడియెన్స్‌ను ఉన్న క్రేజ్‌ను మరింత పెంచడానికి చిత్రయూనిట్ ప్రమోషన్స్ రేంజ్‌ను మరింత పెంచింది.
ప్రమోషన్స్‌లో భాగంగా సైజ్‌జీరో యూనిట్ 1కేజీ బంగారం గెలవండి` అనే కాంటెస్ట్‌ను గెలవండి అంటూ ప్రమోషన్స్‌ను స్టార్ట్ చేస్తున్నారు. కాంటెస్ట్‌లో భాగంగా సినిమాను చూసిన ప్రేక్షకులు టికెట్‌తో పాటు వచ్చిన కూపన్‌కోడ్‌ను 9545466666కి ఎసెమ్మెస్ చేయాలి లేదా టికెట్ కూపన్ కోడ్ వివరాలను లో అప్లోడ్ చేయాలి. ఇలా చేస్తే కిలో బంగారం ప్రేక్షకుల సొంతం అవుతుందట. మరి ఈ బంగారం కాంటెస్ట్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తుందో లేదో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com