'సైజ్ జీరో' డేట్ ఫిక్స్...

  • IndiaGlitz, [Monday,September 14 2015]

అందాల తార అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందుతున్న చిత్రం సైజ్ జీరో. ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కేంద్రుడు త‌న‌యుడు ప్ర‌కాష్ కొవెల‌మూడి తెర‌కెక్కించారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ పి.పి.పి బ్యాన‌ర్ పై తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. వైవిధ్య‌మైన క‌థాంశంతో రూపొందిన ఈ చిత్రంలో అనుష్క స‌ర‌స‌న ఆర్య న‌టించారు.

ఈ చిత్రంలో మ‌న్మ‌ధుడు నాగార్జున గెస్ట్ రోల్ క‌నిపిస్తుండ‌డం విశేషం. ఈ సినిమాకి స్వ‌ర‌వాణి కీర‌వాణి సంగీతాన్ని అందించారు. అయితే సైజ్ జీరో చిత్రం ఆడియో ఇప్ప‌టికే రిలీజ్ కావాలి కానీ... కొన్ని కార‌ణాల వ‌ల‌న వాయిదా ప‌డింది. తాజా స‌మాచారం ప్ర‌కారం సైజ్ జీరో ఆడియోను అక్టోబ‌ర్ 4న‌, సినిమాని అక్టోబ‌ర్ 9న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.