'సైజ్ జీరో' లోగో విడుద‌ల‌

  • IndiaGlitz, [Monday,August 10 2015]

ఎన్నో సూపర్ హిట్ చిత్రాల నిర్మాణ సంస్థ పివిపి బ్యానర్ ప్రొడక్షన్ నెం.10గా నిర్మిస్తోన్న భారీ చిత్రం సైజ్ జీరో'. ప్రకాష్ కోవెలమూడి దర్శకుడు. బాహుబలి' వంటి విజువల్ వండర్ లో దేవసేన పాత్రలో అలరించిన స్టార్ హీరోయిన్ అనుష్క త్వరలోనే డిఫరెంట్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ సైజ్ జీరో'తో మన ముందుకు రానుంది. తెలుగు, తమిళంలో ద్వి భాషా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రం ఈ నెల‌తో షూటింగ్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంటుంది. త్వ‌ర‌లోనే ఫ‌స్ట్ లుక్‌, ఆడియో విడుద‌ల‌కు చిత్ర‌యూనిట్ స‌న్నాహాలు చేస్తుంది.

డిఫరెంట్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న ఈ చిత్రం వెయిట్ లాస్ కి సంబంధించిన కాన్సెప్ట్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం అనుష్క దాదాపు ఇరవై కేజీల బరువు పెరిగింది. అలాగే హీరో ఆర్య ఇచ్చిన టిప్స్ సహాయంతో మళ్లీ బరువు తగ్గి నార్మల్ అయింది. హీరో ఆర్య ఇటీవల స్వీడన్ మీదుగా కఠినతరమైన సైకిల్ రైడ్ ను పూర్తి చేసిన సంగతి తెలిసిందే. సైజ్ జీరో నిర్మాతలు ఈ చిత్రంలో అలాంటి కష్టతరమైన సైక్లింగ్ విన్యాసాలను ఇందులో చూపిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు యం.యయం.కీరవాణి ఈ చిత్రానికి సంగీత సారథ్యం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

అనుష్క, ఆర్య, భరత్, ఊర్వశి ప్రధాన తారాగణంగా నటిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం: యం.యం.కీరవాణి, సినిమాటోగ్రఫీ: నిర్వాషా, ఆర్ట్: ఆనంద్ సాయి, కథ-స్క్రీన్ ప్లే: కణిక థిల్లాన్ కోవెలమూడి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సందీప్ గుణ్ణం, నిర్మాత: ప్రసాద్ వి.పొట్లూరి, దర్శకత్వం: ప్రకాస్ కోవెల మూడి.

More News

మళ్లీ క్రేజీ కాంబినేషన్

‘అష్టాచమ్మా..సినిమా తెలుగు ప్రేక్షకులకు గుర్తుండే ఉంటుంది. క్లాస్ కామెడితో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

డేట్ లో మార్పు లేదంటున్నారు..

మాస్ మహారాజా రవితేజ్ హీరోగా నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాతగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందిన చిత్రం ‘కిక్2’.

రిలీజ్ కు రెడి అవుతున్న 'మాలిని అండ్ కొ'

పూనమ్‌ పాండే, మిలన్ ప్రధాన పాత్రల్లో, మనీషా ఆర్ట్స్‌ అండ్‌ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ పతాకంపై, కిషోర్‌ రాఠి సమర్పణలో, వీరు.కె దర్శకత్వంలో మహేష్‌ రాఠి నిర్మాతగా తెరకెక్కించిన చిత్రం ‘మాలిని అండ్‌ కో’.

ఆమెకు రీల్ లైఫ్ లో జరిగిందే రియల్ లైఫ్ లో జరనుందా?

అసిన్..ఈ మలయాళ భామ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ‘గజనీ’తో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన సదరు హీరోయిన్ వరుస అవకాశాలను అందిపుచ్చుకుంది.

'భలే భలే మగాడివోయ్' టైటిల్ సాంగ్ రిలీజ్...

నాని హీరోగా జిఎ2, యువిక్రియేషన్స్ బ్యానర్స్ పై రూపొందుతోన్న చిత్రం ‘భలే భలే మగాడివోయ్’.