'సైజ్ జీరో' ఆడియో విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
అనుష్క, ఆర్య ప్రధాన పాత్రధారులుగా ప్రముఖ నిర్మాణ సంస్థ పివిపి బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న చిత్రం సైజ్ జీరో`. ప్రకాష్ కోవెమూడి దర్శకుడు. వెయిట్ లాసింగ్ అనే కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని దర్శకుడు కామెడిత్ విత్ మెసేజ్ కలగలిపి తెరకెక్కించారు. ప్రముఖ సంగీత దర్శకుడు యం.యం.కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుద కార్యక్రమాన్ని ఆదివారం హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో నిర్వహించారు.
డిఫరెంట్ పాయింట్ తో ప్రారంభమైన ఈ సినిమా ప్రతి విషయంలో విలక్షణతను ప్రదర్శిస్తుంది. సినిమా ఫస్ట్ లుక్, టీజర్, టైటిల్ సాంగ్ ఇలా ప్రతి విషయంలోని విలక్షణత సినిమాపై మంచి అంచనాలను ఏర్పరిచాయి. ఇప్పుడు అదేవిధంగా డిఫరెంట్ స్టయిల్ లో ఆడియో వేడుకను నిర్వహించారు. వేడుకకు వచ్చిన అతిథులు వెయిట్ మిషన్ పై నిలబడి వెయిట్ చూసుకుని, ఎక్సర్ సైజ్ సైకిల్ ను తొక్కి పాటలను విడుదల చేశారు. కార్య్రకమానికి అతిథులుగా కె.రాఘవేంద్రరావు, రాజమౌళి, శ్యామ్ ప్రసాద్‌రెడ్డి, దిల్‌రాజు, రానా, గుణ్ణం గంగరాజు, బి.గోపాల్, వంశీపైడిపల్లి, గోపీచంద్ మలినేని, దశరథ్, బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ లతో పాటు యూనిట్ సభ్యులు అనుష్క, ఆర్య, అలీ, సోనాల్ చౌహాన్, నిరవ్ షా, కణిక, ప్రకాష్ కోవెలమూడి, పరమ్ వి.పొట్లూరి తదితరులు హాజరయ్యారు.
ఎస్.ఎస్.రాజమౌళి థియేట్రికల్ ట్రైలర్‌ను ఆవిష్కరించారు. బిగ్ సీడీని, ఆడియో సీడీలను కె.రాఘవేంద్రరావు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా...
సంగీత దర్శకుడు యం.యం.కీరవాణి మాట్లాడుతూ... ఇలాంటి ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ సిద్ధం చేసిన కణికను ముందుగా అభినందిస్తున్నాను. రాఘవేంద్రరావుగారితో పనిచేశాను. ఆయన అబ్బాయితో పనిచేస్తానని అప్పుడు ఉహిచంలేదు. తను మంచి క్రమశిక్షణ ఉన్న వ్యక్తి. నిర్మాత పివిపిగారు, అనుష్కలే ఈ సినిమా రూపొందడానికి కారణం. ఇలాంటి కథను నమ్మి చేసిన పివిపిగారిని, సినిమాలో బాగా కష్టపడి యాక్ట్ చేసిన అనుష్కను అభినందిస్తున్నాను. సాంగ్స్ బాగా వచ్చాయి. యూనిట్‌కు ఆల్ ది బెస్ట్.. అన్నారు.
ఎస్.ఎస్.రాజమౌళి మాట్లాడుతూ...బాహుబలి సినిమా షూటింగ్ టైంలో ఓ రోజు అనుష్క ఈ సబ్జెక్ట్ ను నెరేట్ చేసింది. తను ఎగ్జయిటింగ్‌తో చెప్పిన పాయింట్ అప్పుడు నాకు సరిగా అర్థం కాలేదు కానీ తను మంచి సినిమా చేస్తున్నానని ఎగ్జయిట్ అవుతుందని అర్థమైంది. ట్రైలర్స్ ను ఎప్పుడో చూసేశాను. ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ట్రైలర్ తోసినిమా చూడాలనే ఎగ్జయిట్మెంట్ కలిగించారు. ప్రసాద్ పొట్లూరి గారు మంచి ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ తో సినిమాను నిర్మించారు. అలాగే ప్రకాష్ కోవెలమూడి ఏ సినిమా చేసినా సిన్సియర్‌గా నమ్మి చేస్తాడు. కణిక మంచి స్టోరీని ప్రొవైడ్ చేసింది. ఈ సినిమా గ్యారంటీగా సక్సెస్ అవుతుంది... అన్నారు.
అనుష్క మాట్లాడుతూ... కణిక మంచి స్క్రిప్ట్ ను రూపొందించింది. ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు. అందుకే ఓ నటిగా ఈ స్క్రిప్ట్ విన్నప్పుడు కనెక్ట్ అయ్యాను. ఇందులో వెయిట్ లాస్ కు చెందిన కాన్సెప్టే కాదు ఈ సినిమాలో చాలా మంచి మెసేజ్ ఉంది. ప్రకాష్‌గారు సినిమాను చక్కగా డైరెక్ట్ చేశారు. కథను నమ్మి పివిపిగారు ఈ సినిమా చేసినందుకు ఆయనకు థాంక్స్. కీరవాణిగారు ప్రతి సాంగ్ ను బ్యూటిఫుల్ గా ఇచ్చారు. ఆర్య, సోనాల్ సహా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్... అన్నారు.
దర్శకుడు ప్రకాష్ కోవెలమూడి మాట్లాడుతూ... కీరవాణిగారు ఈ సినిమాలో పార్ట్ అయినందుకు హ్యపీగా ఉంది. ఈ ఏడాది ఆయనిచ్చిన బెస్ట్ సాంగ్స్ లో ఇదొకటి. అనంత్ శ్రీరామ్, శ్రీమణి మంచి సాహిత్యాన్ని అందించారు. కిరణ్ మంచి డైలాగ్స్ అందించారు. నిరవ్‌షా సినిమాను బ్యూటీఫుల్‌గా చూపించారు. ఆర్య, భరత్, ప్రకాష్‌రాజ్, సోనాల్, ఊర్వశిగారు ఇలా అందరూ సినిమా కోసం బాగా కష్టపడ్డారు. ఈ కథను వినగానే ముందు అనుష్క చేస్తుందా లేదా అని ఆలోచించాం. కానీ కథ వినగానే ఒప్పుకోవడమే కాదు, కథ డిమాండ్ మేర వెయిట్ పెరిగింది. డేడికేషన్ తో సినిమా చేసింది. మంచి కథ ఇచ్చినందుకు కణికకు థాంక్స్. స్టోరీ వినగానే హార్ట్ టచింగ్‌గా అనిపించి డైరెక్ట్ చేయడానికి రెడీ అయ్యాను. అయితే పివిపిగారు కథ వినగానే సినిమా ఎలా ఉండాలో తన విజన్ తో చూసి సినిమాను పెద్ద సినిమాగా చేయాలని నిర్ణయం తీసుకుని నిర్మించారు. ఆయన విజన్, సపోర్ట్ కు థాంక్స్. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్... అన్నారు.
ఆర్య మాట్లాడుతూ...ఇంత మంచి సినిమాలో అవకాశం ఇచ్చినందుకు థాంక్స్. ఈ చిత్రతం అనుష్క కెరీర్లో మరో బెస్ట్ మూవీగా నిలుస్తుంది. ఈ సినిమా కోసం అందరూ చాలా కష్టపడ్డారు. అందరికీ ఆల్ ది బెస్ట్... అన్నారు.
సోనాల్ చౌహాన్ మాట్లాడుతూ ...ఈ చిత్రంలో నటించడం బ్యూటీఫుల్ జర్నీ. ప్రకాష్ కోవెలమూడిగారు ఫెంటాస్టిక్ డైరెక్టరే కాదు, మంచి స్నేహితుడు. నిర్మాత ప్రసాద్‌గారికి థాంక్స్. అనుష్క స్వీటెస్ట్ పర్సన్. ఆర్య, సందీప్, అరవింద్ అందరికీ థాంక్స్. చాలా హార్డ్‌వర్క్ చేశాం. ప్రతి ఒక్కరి హృదయానికి నచ్చే మూవీ అవుతుంది`` అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్యామ్ ప్రసాద్ రెడ్డి, బి.గోపాల్, దశరథ్, వంశీ పైడిపల్లి, గోపీచంద్ మలినేని తదితరులు చిత్రయూనిట్ ను అభినందించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com