నెల రోజుల గ్యాప్ లో ఆరు చిత్రాలు
- IndiaGlitz, [Wednesday,December 20 2017]
యువ సంగీత దర్శకుడు తమన్‌కి ఈ ఏడాది చెప్పుకోదగ్గ ఫలితాన్నే ఇచ్చింది. మహానుభావుడు రూపంలో మంచి సక్సెస్ దక్కింది. హిందీలో చేసిన తొలి చిత్రం గోల్ మాల్ ఎగైన్ సూపర్ సక్సెస్ అయ్యింది. అలాగే రాజు గారి గది 2కి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మంచి పేరు తీసుకువచ్చింది. ఇదిలా ఉంటే.. వచ్చే ఏడాది మాత్రం తొలి రెండు నెలల్లో తమన్ హవా టాలీవుడ్లో బాగానే కనిపించేలా ఉంది. కేవలం నెల రోజుల గ్యాప్‌లో ఆరు సినిమాలతో తమన్ సందడి చేయనున్నాడు.
విక్రమ్, తమన్నాల తమిళ అనువాద చిత్రం స్కెచ్ సంక్రాంతికి రానుండగా.. అనుష్క నటించిన హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ భాగమతి జనవరి 26న రానుంది. అదే రోజున మంచు విష్ణు నటించిన ఆచారి అమెరికా యాత్ర కూడా రిలీజ్ కాబోతోంది. ఈ మూడు చిత్రాలకి తమన్ నే స్వరకర్త. ఇక ఫిబ్రవరి 9న అయితే.. తమన్ సంగీతంలో మూడు చిత్రాలు విడుదలకి సిద్ధమవుతున్నాయి. వరుణ్ తేజ్ తొలి ప్రేమ.. మోహన్‌బాబు, మంచు విష్ణుల గాయత్రి.. సాయిధరమ్ తేజ్, వి.వి.వినాయక్‌ల పేరు నిర్ణయించని చిత్రం ఆ రోజు సందడి చేయనున్నాయి. అంటే.. జనవరి, ఫిబ్రవరి నెలల్లో కేవలం నెల రోజుల వ్యవధిలో (జనవరి 13 - ఫిబ్రవరి 9) తమన్ అరడజను చిత్రాలతో సందడి చేయనున్నాడన్నమాట.