ఇద్దరి నిర్ణయం..ఆరుగురి జీవితాలు.... చిత్ర దర్శకుడు నందు మల్లెల

  • IndiaGlitz, [Wednesday,July 05 2017]

సాయి కొర్రపాటి సమర్పణలో వారాహి చలన చిత్రం, డే డ్రీమ్స్‌ బ్యానర్‌పై అనిల్‌ మల్లెల, మహిమ హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం 'రెండు రెళ్ళు ఆరు'. నందు మల్లెల దర్శకుడు. ప్రదీప్‌ చంద్ర, మోహన్‌ అందె నిర్మాతలు. ఈ సినిమా జూలై 8న విడుదలవుతుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు నందు మల్లెలతో ఇంటర్వ్యూ విశేషాలు...
జంధ్యాల టైటిల్ వెనుక కార‌ణం...
నా పూర్తి పేరు నాగేంద్రబాబు కానీ నన్ను అందరూ నందు అని పిలుస్తుంటారు. నాకు జంధ్యాలగారి రచలన్నా, పింగళి నాగేంద్రరావుగారి దర్శకత్వమన్నా చాలా ఇష్టం. జంధ్యాలగారి సినిమా పేరుని నా సినిమా టైటిల్‌గా పెట్టుకోవడం ఆనందంగా ఉంది. ఇక మా 'రెండు రెళ్ళు ఆరు' సినిమా విషయానికి వస్తే..ఇద్దరు తీసుకునే నిర్ణయం ఆరుగురి జీవితాలను ఎలా ప్రభావితం చేసిందనేదే కథ కాబట్టి 'రెండు రెళ్ళు ఆరు' అనే టైటిల్‌ను పెట్టాం.
క‌థాలోచ‌న‌...
మా ఊరి పక్కనుండే ఓ కుటుంబంలో ఒక అడపిల్ల, ముగ్గురు మగపిల్లలుండేవారు. ఆ ముగ్గురు మగ పిల్లలు 33 వయసు వచ్చాక చనిపోయారు. సమస్యేంటో ఎవరికీ అర్థం కాలేదు. అది నా మైండ్‌లో అలాగే ఉండిపోయింది. ఆ ఘటన నుండే ఈ 'రెండు రెళ్ళు ఆరు' కథ పుట్టింది.
రెండింటికీ తేడాఉంది...
'గీతాంజలి' సినిమాకు, మా సినిమాకు చాలా తేడా ఉంది. నాగార్జునగారి 'గీతాంజలి' ఓ ప్రేమకథ, హీరో హీరోయిన్‌ పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో రన్‌ అవుతుంటుంది. కానీ మా సినిమా ఎమోషన్‌ ఫ్యామిలీ స్టోరీ హీరో హీరోయిన్‌ తండ్రుల పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో సినిమా రన్‌ అవుతుంటుంది.
కొత్త‌ద‌నం కోస‌మే..
కంప్లీట్‌ కామెడి, సెంటిమెంట్‌ ఆధారంగా సన్నివేశాలను డిజైన్‌ చేసుకున్నాను. క్యారెక్టర్స్‌లో కొత్తదనం ఉండాలని విలన్‌గా నటించిన రవి కాలేగారితో తండ్రి పాత్ర చేయించాను. అలాగే దాదాపు ప్రతి సినిమాలో తాగుబోతు పాత్రలో కనపడే తాగుబోతు రమేష్‌ డిఫరెంట్‌ క్యారెక్టర్‌లో కనపడేలా చూసుకున్నాం.
సినిమా అలా ప్రారంభ‌మైంది...
ఏడాదిన్న‌ర క్రితం ముప్పై రూపాయలతో సితార హోటల్‌లో ప్రారంభమైంది. కథ విన్న నిర్మాతగారు అడ్వాన్స్‌ ఎంత కావాలి అని అన్నారు. అవకాశం రావడమే ఎక్కువ అని అనుకుంటున్న సమయంలో అడ్వాన్స్‌ అంటున్నారే అని మీ ఇష్టం సార్‌..అన్నాను. ఆయన మూడు టీలకు డబ్బులిచ్చి వెళ్ళిపోయారు. నాకు ఏం అర్థం కాలేదు. మరుసటి రోజు సినిమా కోసం ఆఫీస్‌ తీసుకో అని ఫోన్‌ చేశారు., ఓ నమ్మకం ఏర్పడింది. నేను నిర్మాతగారిని అంతలా నమ్మడానికి కారణమేమంటే..ఆయన రెండు సంవత్సరాలుగా కథలు వింటున్నారు. మంచి కథలు కోసం ఎదురుచూస్తున్నారు. నా కథ నచ్చింది కాబట్టే సినిమా చేయడానికి ముందుకు వచ్చారనిపించింది.
సాయికొర్ర‌పాటి స‌పోర్ట్‌...
సినిమా పూర్తి కాగానే చిన్న సినిమా సమస్యలు వచ్చాయి. ఆ సమయంలో సాయి కొర్రపాటిగారిని కలిశాం. ఆయన్ను సినిమా చూడమని ఓ వ్యక్తి రెఫర్‌ చేశాడు. ఆయన సరేనని సినిమా చూడటం ప్రారంభించారు. సినిమా స్టార్ట్‌ అయిన పది నిమిషాలకే ఈ సినిమాను నేను తీసుకుంటున్నానని తెలిపారు. ఈరోజు సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుందంటే ఆయ‌నే కార‌ణం.
బ‌డ్జెట్ గురించి అడ‌గ‌లేదు...
ఓ దర్శకుడిగా నాకు ఈ సినిమా బడ్జెట్‌ ఎంతయ్యిందో నాకు తెలియదు. కానీ ఇది నిజం..నేను నాకు, నా టీంకు ఏ రెమ్యునరేషన్స్‌ అడగలేదు. కానీ నా సినిమాకు ఏది అవసరమో దాన్ని సమకూర్చమని కోరాను. వారలాగే చేశారు.
నిర్మాతే సెల‌క్ట్ చేశారు...
ఈ సినిమాలో హీరో నా బ్రదర్‌ అయినా, హీరోను నేను సెలక్ట్‌ చేయలేదు. నిర్మాతగారే సెలక్ట్‌ చేశారు. సినిమా స్క్రిప్ట్‌ వర్క్‌ స్టార్ట్‌ అయిన పది రోజుల తర్వాత నిర్మాతగారుహీరో అనిల్ నా తమ్ముడని నిర్మాతగారికి కూడా తెలిసింది. నా సినిమాలో క్యారెక్టర్స్‌ కనపడాలని అనుకున్నాను కాబట్టే కొత్తవారితో సినిమా చేశాను. నెక్స్‌ట్‌ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతుంది. త్వరలోనే ఆ వివరాలను తెలియజేస్తాను'' అన్నారు.

More News

పక్కింటి అబ్బాయి పాత్రలో ఆది

భవ్య క్రియేషన్స్ బ్యానర్పై వి.ఆనంద్ ప్రసాద్ నిర్మాతగా నారా రోహిత్, సుధీర్బాబు, సందీప్కిషన్, ఆది హీరోలుగా రూపొందిన చిత్రం 'శమంతకమణి'. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు.

'రక్తం' కు అంతర్జాతీయ అవార్డు రావడం ఓ గ్రేట్ థింగ్: నటుడు బెనర్జీ

సీనియర్ నటుడు బెనర్జీ ప్రధాన పాత్ర లో రాజేష్ టచ్ రివర్ దర్శకత్వంలో తెరకెక్కిన `రక్తం` చిత్రానికి అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ ఇండీ గేదరింగ్ ఫారిన్ డ్రామా ఫీచర్స్ సెగ్మెంట్ లో (2017) అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే.

విజయపథంలో గువ్వ గోరింక తొలిపాట

తొలిపాటతోనే మా గువ్వ గోరింక చిత్రం అటు టాలీవుడ్లో..

'ఏజెంట్ భైరవ' తెలుగు ప్రేక్షకులను మెప్పించే కమర్షియల్ ఎంటర్ టైనర్- నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి

పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్పై విజయ్, కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా, జగపతిబాబు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'ఏజెంట్ భైరవ'.భరతన్ దర్శకుడు.

'దండుపాళ్యం' దర్శకుడు శ్రీనివాసరాజు 5 భాషల్లో రూపొందిస్తున్న మరో సంచలన చిత్రం

'దండుపాళ్యం' వంటి సంచలన చిత్రంతో తెలుగు, కన్నడ భాషల్లో ఘనవిజయాల్ని అందుకున్న దర్శకుడు శ్రీనివాసరాజు ఆ చిత్రానికి సీక్వెల్గా 'దండుపాళ్యం2' చిత్రాన్ని రూపొందించిన విషయం తెలిసిందే.