6 రోజులు..3 ఆడియోలు..1 మ్యూజిక్ డైరెక్టర్..
Send us your feedback to audioarticles@vaarta.com
6 రోజులు..3 ఆడియోలు..1 మ్యూజిక్ డైరెక్టర్...ఆ ఒక్క మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో కాదు...మిక్కీ జే మేయర్. నితిన్ - త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం అ ఆ. ఈ చిత్రాన్ని హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మించారు. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందించిన అ ఆ ఆడియోను మే 2న రిలీజ్ చేస్తున్నారు. ఆతర్వాత మే 7న సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రహ్మోత్సవం ఆడియో రిలీజ్ చేయనున్నారు. శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన బ్రహ్మోత్సవంకు కూడా మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందించారు.
ఆతర్వాత మే 8న ఒక్క అమ్మాయి తప్ప ఆడియో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో సందీప్ కిషన్ - నిత్యామీనన్ జంటగా నటించారు. ఈ చిత్రం ద్వారా రచయిత రాజసింహ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి కూడా మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. ఇలా...6 రోజుల్లో...3 ఆడియోలు రిలీజ్ అవుతుండడం...ఈ మూడు చిత్రాలకు మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్ కావడం...ఈ మూడు ఆడియోలు శిల్పకళావేదికలో రిలీజ్ అవుతుండడం విశేషం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com