ఈనెల 27న శివలింగ ఆడియో
Tuesday, January 24, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
కొరియోగ్రాపర్, డైరెక్టర్, హీరోగా తనదైన గుర్తింపు తెచ్చుకున్న లారెన్స్ తాజాగా ఇప్పుడు పి.వాసు దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న శివలింగ` చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీగా ఉన్నారు. కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్ నటించిన శివలింగ చిత్రాన్ని అదే టైటిల్ తో రీమేక్‌గా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో అభిషేక్ ఫిలింస్ పతాకంపై రమేష్ పి. పిళ్లై నిర్మిస్తున్నారు. ఇటీవలే విడుదలైన టీజర్ లైక్ లతో యూ ట్యూబ్ లో దూసుకుపోతుంది. పోస్టర్ల తో క్యూరియాసిటీ పెంచేస్తున్నాడు లారెన్స్ .
తాజాగా సినిమా ఆడియోను ఈ నెల 27 న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ ``కథే హీరోగా కన్నడ లో బ్లాక్ బస్టర్ అయిన చిత్రం 'శివలింగ '. పి.వాసు గారి చంద్రముఖి, లారెన్స్ కాంచన , గంగ చిత్రాలను మించిన కథ, కథనాలతో హార్రర్ ఎంటర్ టైనర్ గా శివలింగ తెరకెక్కుతోంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. టీజర్ , పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈనెల 27న ఆడియో, అలాగే సినిమాను ఫిబ్రవరి లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. హార్రర్ కాన్సెప్ట్ ల పరంగా శివలింగ నెక్ట్స్ లెవెల్ లొ ఉండే చిత్రమని` అన్నారు.
ఇందులో హీరోయిన గా రితికా సింగ్ నటిస్తోంది. వడివేలు, శక్తివాసు, రాధారవి, జయప్రకాష్, ప్రదీప్ రావత్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీః సర్వేష్ మురారి. మ్యూజిక్ః ఎస్.ఎస్.థమన్, సాహిత్యంః రామజోగయ్య శాస్త్రి, ఆర్ట్ః దురైరాజ్, ఫైట్స్ః అనల్ అరసు, దినేష్, ఎడిటింగ్ః సురేష్, నిర్మాతః రమేష్.పి.పిళ్లై , దర్శకత్వంః పి.వాసు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments