ఈనెల 27న శివలింగ ఆడియో

  • IndiaGlitz, [Tuesday,January 24 2017]

కొరియోగ్రాప‌ర్‌, డైరెక్ట‌ర్, హీరోగా త‌న‌దైన గుర్తింపు తెచ్చుకున్న లారెన్స్ తాజాగా ఇప్పుడు పి.వాసు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిస్తున్న శివ‌లింగ' చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికి రెడీగా ఉన్నారు. క‌న్న‌డ సూప‌ర్‌స్టార్ శివ‌రాజ్‌కుమార్ న‌టించిన శివ‌లింగ చిత్రాన్ని అదే టైటిల్ తో రీమేక్‌గా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో అభిషేక్ ఫిలింస్ పతాకంపై రమేష్ పి. పిళ్లై నిర్మిస్తున్నారు. ఇటీవ‌లే విడుద‌లైన టీజ‌ర్ లైక్ ల‌తో యూ ట్యూబ్ లో దూసుకుపోతుంది. పోస్ట‌ర్ల తో క్యూరియాసిటీ పెంచేస్తున్నాడు లారెన్స్ .
తాజాగా సినిమా ఆడియోను ఈ నెల 27 న రిలీజ్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ ''కథే హీరోగా కన్నడ లో బ్లాక్ బస్టర్ అయిన చిత్రం 'శివలింగ '. పి.వాసు గారి చంద్రముఖి, లారెన్స్ కాంచన , గంగ చిత్రాలను మించిన కథ, కథనాలతో హార్రర్ ఎంటర్ టైనర్ గా శివలింగ తెరకెక్కుతోంది. ప్ర‌స్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. టీజ‌ర్ , పోస్ట‌ర్ కు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఈనెల 27న ఆడియో, అలాగే సినిమాను ఫిబ్రవరి లో విడుదల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం. హార్రర్ కాన్సెప్ట్ ల పరంగా శివలింగ నెక్ట్స్ లెవెల్ లొ ఉండే చిత్రమని' అన్నారు.
ఇందులో హీరోయిన గా రితికా సింగ్ న‌టిస్తోంది. వ‌డివేలు, శ‌క్తివాసు, రాధార‌వి, జ‌య‌ప్ర‌కాష్‌, ప్ర‌దీప్ రావ‌త్ త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.
ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీః స‌ర్వేష్ మురారి. మ్యూజిక్ః ఎస్‌.ఎస్‌.థ‌మ‌న్‌, సాహిత్యంః రామ‌జోగ‌య్య శాస్త్రి, ఆర్ట్ః దురైరాజ్‌, ఫైట్స్ః అన‌ల్ అర‌సు, దినేష్‌, ఎడిటింగ్ః సురేష్‌, నిర్మాతః ర‌మేష్‌.పి.పిళ్లై , దర్శకత్వంః పి.వాసు

More News

ఫిబ్రవరి 10న విడుదలకు ముస్తాబవుతున్న చిత్రాంగద

ప్రముఖ కథానాయిక అంజలి టైటిల్ పాత్రలో తెలుగు, తమిళ భాషల్లో ఓ క్రేజీ చిత్రం రూపొందుతోంది. తెలుగులో చిత్రాంగద పేరుతో.. తమిళంలో యార్నీ పేరుతో ఏకకాలంలో తెరకెక్కుతోన్న ఈ హరీజెంటల్ థ్రిల్లర్ కామెడీ చిత్రానికి పిల్ల జమీందార్ వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించి, ప్రస్తుతం

నేషనల్ గర్ల్ చైల్డ్ డే నాడు మహేష్ ట్వీట్....

జనవరి 24...నేషనల్ గర్ల్ చైల్డ్ డే ..

నెగటిల్ రోల్ లో ఎన్టీఆర్...?

డిఫరెంట్ పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరలోనే తన తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నాడు. బాబీ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాను నందమూరి కల్యాణ్రామ్ నిర్మాతగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై రూపొందిస్తున్నారు.

'గౌతమిపుత్ర శాతకర్ణి' సినిమా నటుడుగా నాకు మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది - నటుడు సునీల్కుమార్

ఈ సంక్రాంతికి నేను నటించిన రెండు చిత్రాలు విడుదలై మంచి విజయాలను సాధించాయి. నటుడుగా నాకు మంచి పేరును తెచ్చాయని అంటున్నాడు నటుడు సునీల్కుమార్.

వివాదస్పద డైరెక్టర్ కు కోర్టు నోటీసులు...

'ద్యావుడా'అనే సినిమా ఒక మతాన్ని కించపరిచే రీతిలో ఉందని,ఈ సినిమా నిర్మాణానికి,విడుదలకు అనుమతులు ఇవ్వరాదంటూ