Prince: శివకార్తికేయన్ 'ప్రిన్స్' ఫస్ట్ సింగల్ 'బింబిలిక్కి పిలాపి' విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
వరుస బ్లాక్ బస్టర్ విజయాలతో దూసుకుపోతున్న శివకార్తికేయన్ కథానాయకుడిగా, టాలెంటెడ్ డైరెక్టర్ అనుదీప్ కెవి దర్శకత్వంలో తెలుగు, తమిళ్ భాషలలో ఏకకాలంలో తెరకెక్కుతున్న కంప్లీట్ ఎంటర్‌టైనర్ 'ప్రిన్స్'. శివకార్తికేయన్ సరసన మారియా ర్యాబోషప్క కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రం ఇండియాలోని పాండిచ్చేరి, లండన్ నేపథ్యంలో రూపొందుతోంది.
ఈ చిత్రం మ్యూజికల్ ప్రమోషన్‌లను ఫస్ట్ సింగల్ ''బింబిలిక్కి పిలాపి''డ్యాన్స్ నెంబర్ తో గ్రాండ్ గా ప్రారంభించింది చిత్ర యూనిట్. సంగీత సంచలనం ఎస్ తమన్ ఈ పాటని తనదైన స్టయిల్ లో మాస్ బీట్ డ్యాన్స్ నెంబర్ గా కంపోజ్ చేయగా.. శివకార్తికేయన్ ఈ పాటకు చేసిన డ్యాన్స్ మూమెంట్స్ నెక్స్ట్ లెవల్ లో వున్నాయి. ఈ పాటని చూస్తుంటే థియేటర్లో ఫ్యాన్స్ విజల్స్ వేయడం ఖాయమనిపిస్తోంది.
రామ్ మిరియాల, రమ్య బెహరా, సాహితీ చాగంటి త్రయం ఈ పాటని డైనమిక్ గా ఆలపించగా.. సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం ఆకట్టుకుంది. ఈ పాటలో శివకార్తికేయన్ డ్యాన్స్ మూమెంట్స్ అలరించగా, మారియా కూడా శివకార్తికేయన్ యొక్క ఎనర్జీని మ్యాచ్ చేయడానికి ప్రయత్నించింది. మారియా తన సూపర్ కూల్ లుక్స్, స్టైలిష్ డ్యాన్స్ మూవ్స్‌తో ఆకట్టుకుంది. నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో సునీల్ నారంగ్, డి.సురేష్ బాబు, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోనాలి నారంగ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్ గా, ప్రవీణ్ కెఎల్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. అరుణ్ విశ్వ సహ నిర్మాత.
తారాగణం: శివకార్తికేయన్, మరియా ర్యాబోషప్క, సత్యరాజ్ తదితరులు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments