నటుడు శివాజీరాజాకు హార్ట్ ఎటాక్
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ ప్రముఖ నటుడు శివాజీరాజాకు గుండెపోటు వచ్చింది. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు హుటాహుటిన నగరంలోని స్టార్ ఆస్పత్రికి తరలించారు. బీపీ డౌన్ అవ్వడంతో హార్ట్ స్ట్రోక్ వచ్చిందని సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుతం స్టార్ ఆస్పత్రిలో వైద్యుల ప్రత్యేక బృందంతో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం అబ్జర్వేషన్‌లో ఉన్న ఆయనకు ఎల్లుండి స్టంట్ వేయనున్నట్లు వైద్యులు చెప్పగా శివాజీరాజా కుటుంబ సభ్యులకు మీడియాకు సమాచారం అందించారు. అభిమానులు, ఆప్తులు, మిత్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అక్కర్లేదని.. ఆయన క్షేమంగానే ఉన్నారని మీడియాకు ఓ ఆడియోను విడుదల చేశారు.
గత కొన్ని రోజులుగా..!
ఇదిలా ఉంటే.. దాదాపు మూడు దశాబ్ధాలుగా ఇండస్ట్రీలోనే ఉన్న ఆయన కొన్ని వందల సినిమాల్లో నటించారు. అలనాటి టాలీవుడ్ అగ్ర హీరోల నుంచి ఇప్పటి అగ్రహీరోలు, జూనియర్లు, సీనియర్లు అనే తేడా లేకుండా మంచి మంచి పాత్రల్లో నటించి మెప్పించారు. ఒక టెర్మ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా ఆయన పనిచేశారు. ఆ తర్వాత మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయగా.. ఘట్టమనేని నరేష్ చేతిలో ఓటమిపాలయ్యారు. కాగా.. గతేడాది మా అసోసియేషన్ ఎన్నికలు ముగిసిన తర్వాత బయట పెద్దగా కనిపించడం లేదు. లాక్ డౌన్‌తో గత కొన్ని రోజులుగా సొంత ఫామ్‌హౌజ్‌లో కూరగాయలు పండిస్తూ సినిమా కార్మికులకు ఉచితంగా పంచి పెడుతున్నారు. అయితే ఉన్నట్లుండి గుండెపోటు రావడంతో ఇండస్ట్రీ అంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యింది. శివాజీ రాజా వీలైనంత త్వరలోనే కోలుకోవాలని ఆప్తులు, అభిమానులు, అత్యంత సన్నిహితులు దేవున్ని ప్రార్థిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments