నరేష్‌పై శివాజీరాజా హాట్ కామెంట్స్.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు
Send us your feedback to audioarticles@vaarta.com
`మా` డైరీ ఆవిష్కరణలో రాజశేఖర్ ప్రవర్తించిన తీరుతో మరోసారి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో ఉన్న లుకలుకలు బయటపడ్డాయి. ఈ వ్యవహారంపై `మా` మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా తనదైన శైలిలో ఘాటుగా స్పందించారు. చిరంజీవి సహా సినీ ప్రముఖులు స్టేజీపై ఉండగా ఇలాంటి ఘటన జరగడం చాలా బాధగా అనిపించిందని అయన అన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ ``ప్రతి ఒక్కరరూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎన్నికలు జరిగిన ఇన్నిరోజులు అవుతున్నప్పటికీ రూపాయి కూడా లెక్క చెప్పని అధ్యక్షుడు ఈ వ్యవహారంపై ఏమంటారు. రాజశేఖర్ చాలా ఎమోషనల్. మా కోసం పది లక్షల రూపాయలు విరాళమిచ్చి దానిపై నోరు కూడా మెదపని వ్యక్తి. ఎన్నికలు ముందు మాపై ఎన్నో ఆరోపణలు చేసిన వ్యక్తి లెక్కల్లో తప్పు లేదని తేలినప్పుడు కనీసం క్షమాపణలు కూడా చెప్పలేదు`` అన్నారు.
అయితే మా వ్యవహారంపై దర్శక నిర్మాత తమ్మారెడ్డి మరో రకంగా స్పందించారు. ఆధిపత్యం కోసమే మా లో గొడవలు జరుగుతున్నాయని తమ్మారెడ్డి అన్నారు. ఇలాంటి గొడవలు మా భవిష్యత్తుకు ఇబ్బందులను కలిగిస్తుంది. సినీ పెద్దల ముందు ఇలాంటి గొడవలు జరగడం మంచికే అనుకోవాలి. ఇలాంటి పరిణామాల వల్ల ఇలాంటి సమస్యలు మళ్లీ రాకుండా చూసుకుంటారు. మా అసోసియేషన్‌ను చిరంజీవి ముందుండి నడిపించాలని అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments