న‌రేష్‌పై శివాజీరాజా హాట్ కామెంట్స్‌.. త‌మ్మారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

  • IndiaGlitz, [Friday,January 03 2020]

'మా' డైరీ ఆవిష్క‌ర‌ణ‌లో రాజ‌శేఖ‌ర్ ప్ర‌వ‌ర్తించిన తీరుతో మ‌రోసారి మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌లో ఉన్న లుక‌లుక‌లు బ‌య‌ట‌ప‌డ్డాయి. ఈ వ్య‌వ‌హారంపై 'మా' మాజీ అధ్య‌క్షుడు శివాజీ రాజా త‌న‌దైన శైలిలో ఘాటుగా స్పందించారు. చిరంజీవి స‌హా సినీ ప్ర‌ముఖులు స్టేజీపై ఉండ‌గా ఇలాంటి ఘ‌ట‌న జ‌ర‌గ‌డం చాలా బాధ‌గా అనిపించింద‌ని అయ‌న అన్నారు.

ఇంకా ఆయ‌న మాట్లాడుతూ ''ప్ర‌తి ఒక్క‌ర‌రూ ఆత్మ ప‌రిశీల‌న చేసుకోవాలి. ఎన్నిక‌లు జ‌రిగిన ఇన్నిరోజులు అవుతున్న‌ప్ప‌టికీ రూపాయి కూడా లెక్క చెప్ప‌ని అధ్య‌క్షుడు ఈ వ్య‌వ‌హారంపై ఏమంటారు. రాజ‌శేఖ‌ర్ చాలా ఎమోష‌న‌ల్‌. మా కోసం ప‌ది ల‌క్ష‌ల రూపాయ‌లు విరాళ‌మిచ్చి దానిపై నోరు కూడా మెద‌ప‌ని వ్య‌క్తి. ఎన్నిక‌లు ముందు మాపై ఎన్నో ఆరోప‌ణ‌లు చేసిన వ్య‌క్తి లెక్క‌ల్లో త‌ప్పు లేద‌ని తేలిన‌ప్పుడు కనీసం క్ష‌మాప‌ణ‌లు కూడా చెప్ప‌లేదు'' అన్నారు.

అయితే మా వ్య‌వ‌హారంపై ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి మ‌రో ర‌కంగా స్పందించారు. ఆధిప‌త్యం కోస‌మే మా లో గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయ‌ని త‌మ్మారెడ్డి అన్నారు. ఇలాంటి గొడ‌వ‌లు మా భ‌విష్య‌త్తుకు ఇబ్బందుల‌ను క‌లిగిస్తుంది. సినీ పెద్ద‌ల ముందు ఇలాంటి గొడ‌వ‌లు జ‌ర‌గ‌డం మంచికే అనుకోవాలి. ఇలాంటి ప‌రిణామాల వ‌ల్ల ఇలాంటి స‌మ‌స్య‌లు మ‌ళ్లీ రాకుండా చూసుకుంటారు. మా అసోసియేష‌న్‌ను చిరంజీవి ముందుండి న‌డిపించాల‌ని అన్నారు.

More News

'అల వైకుంఠపురంలో..' సెన్సార్ పూర్తి

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో

జాగ్వార్ స్టూడియోస్ పతాకంపై బి. వినోద్ జైన్ సమర్పణలో ‘గర్జన’

మనిషి, జంతువు... వీరిలో ఎవరు ఎక్కువ ప్రమాదకరం? ఆహారం కోసమో, రక్షణ కోసమో మాత్రమే జంతువు దాడి చేస్తుంది...

'నమస్తే నేస్తమా`చిత్రానికి థియేటర్స్ లో 80పర్సెంట్ ఆక్యుపెన్సీ ఉండడం సంతోషంగా ఉంది - దర్శక నిర్మాత  కె.సి బొకాడియా

యానిమల్స్ మెయిన్ క్యారెక్టర్ లో రూపొందిన చిత్రాల‌న్నిసూపర్ హిట్స్ సాధించాయి. ఒక డాగ్ ప్రధాన పాత్రలో

తనీష్ మహాప్రస్థానం షూటింగ్ పూర్తి

యువ కథానాయకుడు తనీష్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా మహాప్రస్థానం. ఓంకారేశ్వర క్రియేషన్స్ పతాకంపై

2019 తెలంగాణ రౌండప్.. కేసీఆర్‌కు బూస్ట్ ఇచ్చిన వైఎస్ జగన్!

2019కు గుడ్ బై చెప్పేసి మరికొన్ని గంటల్లోనే కోటి ఆశలతో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం.