Bigg Boss 7 Telugu : శివాజీకి బిగ్‌షాక్ .. తేజకు పనిష్మెంట్లు, నువ్వేమైనా గుడ్డోడివా సందీప్‌పై నాగ్ ఆగ్రహం
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ 7 తెలుగు నాలుగో వారం కూడా ఎండింగ్ దశకు చేరుకుంది. శనివారం కావడంతో హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. అయితే ఆయన బెల్ట్ తీసుకుని చాలా సీరియస్‌గా రావడంతో కంటెస్టెంట్స్ అంతా భయపడ్డారు. ప్రేక్షకులు కూడా ఏం జరగబోతోందోనని చాలా టెన్షన్ ఇచ్చారు. వచ్చిరాగానే తనదైన స్టైల్‌లో ఈవారం ఇంటి సభ్యులు చేసిన పనులు, వారి పర్ఫార్మెన్స్‌ను రివ్యూ చేశారు. పవర్ అస్త్ర కోసం పెట్టిన స్మైలీ ఫోటో టాస్క్‌లో తేజ ప్రవర్తనపై ఆయన బాగా ఆగ్రహం వ్యక్తం చేశారు. గౌతమ్ మెడకు బెల్ట్ వేసి తేజ లాగుతుంటే మీరిద్దరూ ఎందుకు సైలెంట్‌గా వున్నారని శివాజీ, ఆట సందీప్‌లను నాగ్ ప్రశ్నించారు. నువ్వేమైనా గుడ్డోడివా, నీ కళ్లముందు ఏం జరుగుతుందో కనిపించలేదా అంటూ సందీప్‌పై ఫైర్ అయ్యారు. సంచాలకగా నువ్వు పూర్తిగా ఫెయిల్ అయ్యావంటూ నాగార్జున అసహనం వ్యక్తం చేశారు.
వాళ్లిద్దరికే అలా వుంటే మరి తప్పు చేసిన తేజకి మామూలగా వుండదు కదా. గౌతమ్ మెడలో బెల్ట్ వేసినప్పుడు లేడీ కంటెస్టెంట్స్ ఆపమంటున్నా ఎందుకు ఆపలేని తేజని ప్రశ్నించారు. ఇతనికి ఏం శిక్ష వేద్దామని కంటెస్టెంట్స్‌ని అడగ్గా.. తేజని జైళ్లో వేయడంతో పాటు ఇంటి పనులన్నీ చేయాలని వారు చెప్పారు. దీనికి నాగ్ సరేనన్నారు. అలాగే వచ్చే వారం నేరుగా నామినేట్ చేస్తున్నట్లు హోస్ట్ ప్రకటించారు. తేజ తాను తప్పుచేశానని అంగీకరిస్తూ క్షమాపణలు కోరాడు. తర్వాత శివాజీ.. శుభశ్రీ మీదకు వెళ్లడాన్ని నాగ్ ప్రస్తావించారు. ఆయన అలా ప్రవర్తించంతో చాలా ఇబ్బంది పడ్డానని శుభశ్రీ నాగార్జునకు చెప్పింది.
అనంతరం ఇప్పటికే హౌస్‌మెట్స్ అయిన వారిలో ఎవరు అర్హులు, ఎవరు అనర్హులో చెప్పాలని కంటెస్టెంట్స్‌ని కోరాడు నాగార్జున. అయితే సందీప్, శివాజీలను చెరో ముగ్గురు నామినేట్ చేశారు. దీంతో మరోసారి అందరినీ అడగ్గా.. సందీప్‌ని ముగ్గురు, శివాజీని ఏకంగా ఆరుగురు నామినేట్ చేశారు. దీంతో శివాజీని తిరిగి కంటెస్టెంట్‌గా ప్రకటిస్తూ.. అతని దగ్గరున్న పవర్ అస్త్రను తీసుకుని దానిని ధ్వంసం చేయాల్సిందిగా శోభాశెట్టిని ఆదేశించారు నాగ్. అలాగే శివాజీ డీలక్స్ రూమ్‌లో వుండే అర్హత కోల్పోయాడని తెలిపాడు. ఇక ఈవారం నాలుగో పవర్ అస్త్రను గెలుచుకున్న పల్లవి ప్రశాంత్‌కు దానిని అందజేశారు.
ఈ వారం ఆరుగురు నామినేషన్స్‌లో వున్నారు. ప్రియాంక, ప్రిన్స్ యావర్, శుభశ్రీ, గౌతమ్, రతిక, తేజ నామినేట్ అయ్యారు. అయితే వీరిలో రతిక ఎలిమినేట్ అయినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆమె కనుక ఎలిమినేట్ అయితే వరుసగా నాలుగో లేడీ కంటెస్టెంట్ హౌస్‌ను వీడినట్లు. ఇప్పటికే కిరణ్ రాథోడ్, షకీలా, దామినిలు తొలి మూడు వారాలు ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments