Bigg Boss 7 Telugu : శుభశ్రీ మీద మీదకు వెళ్లిన శివాజీ.. బిడ్డ అంటూ ఏంటిది, నాలుగో పవర్ అస్త్రకు పోటీ మొదలు
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ 7 తెలుగులో నామినేషన్స్ హడావుడి ముగిసింది. వాదనలు, కొట్లాటలు, గొడవల అనంతరం ఈ వారం ఆరుగురు నామినేషన్స్‌లో వున్నారు. ప్రియాంక, ప్రిన్స్ యావర్, శుభశ్రీ, గౌతమ్, రతిక, తేజ నామినేట్ అయ్యారు. అంతా నామినేషన్స్ మూడ్ నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించినా బిగ్‌బాస్ మాత్రం చిచ్చు పెట్టాలని డిసైడ్ అయ్యాడు. నాల్గవ పవర్ అస్త్ర కోసం కొత్త టాస్క్ ఇచ్చాడు. శివాజీ, సందీప్, శోభాశెట్టిలు బ్యాంకర్స్‌గా వ్యవహరిస్తారని.. వీరి ఒక్కొక్కరి దగ్గర పది వేల విలువైన బీబీ కాయిన్స్ వుంటాయని.. వాటిని మిగిలిన కంటెస్టెంట్స్‌కి ఇవ్వాల్సి వుంటుంది. ప్రతి కాయిన్ విలువ 100గా వుంటుందని , ఇచ్చిన కాయిన్స్‌ను సేఫ్ డిపాజిట్‌లో వుంచాలని బిగ్‌బాస్ చెప్పాడు. టాస్క్ ముగిసే సరికి ఎవరి దగ్గరైతే ఎక్కువ కాయిన్స్ వుంటాయో వాళ్లు నాలుగో పవర్ అస్త్ర పోటీలో వుంటారని తెలిపాడు. ఇందులో తేజ 51, రతిక 35, గౌతమ్ 24, ప్రియాంక 41, శుభ శ్రీ 31, ప్రశాంత్ 33, అమర్ 41, యావర్ 43 కాయిన్స్ పొందారు.
నాలుగో పవర్ అస్త్ర కోసం ముందుగా స్మైల్ ప్లీజ్ అనే టాస్క్‌ను ఇచ్చారు బిగ్‌బాస్. ఇందులో అమర్‌దీప్, గౌతమ్ ఓ టీమ్‌గా.. రతిక , టేస్టీ తేజ మరో టీమ్‌గా ఆడారు. రెండు జట్లలోని ఇంటి సభ్యులు మరో టీమ్ కెమెరా ముందుకు వెళ్లి స్మైల్ చేస్తూ ఫోటోలు తీసుకోకుండా అడ్డుకోవాలి. రతికను అమర్‌దీప్ అడ్డుకోగా.. తేజను గౌతమ్ అడ్డుకోలేకపోయాడు. తర్వాత అమర్‌దీప్, గౌతమ్‌లు ఫోటోలు దిగేందుకు సిద్ధమవ్వగా.. రతిక, తేజ వారిని ఆపడానికి ప్రయత్నించారు.
ఈ రెండు జట్లలో ఎవరు గెలిచారో నిర్ణయించే అవకాశం శోభాశెట్టి చేతికి వెళ్లింది. అయితే యెల్లో బాక్స్‌లో వుండి ఫోటోలు దిగాలని బిగ్‌బాస్ చెబితే.. అమర్‌దీప్ ఆ కండీషన్ ఫాలో కాలేదని శోభ అనడంతో అమర్‌దీప్ ఫైర్ అయ్యాడు. యెల్లో బాక్స్‌లో సగం వున్నానా, పూర్తిగా వున్నానా అన్నది నా ఇష్టం అని బదులిచ్చాడు. మొత్తంగా గౌతమ్, అమర్‌దీప్ జోడీ 14 సార్లు ఫోటోలకు ఫోజులు ఇచ్చి ఓడిన టీమ్ దగ్గరున్న కాయిన్స్‌ను సొంతం చేసుకున్నారు.
అంతకుముందు బ్యాంకర్స్ నుంచి మెప్పించి కాయిన్స్ కొట్టేసేందుకు కంటెస్టెంట్స్ నానా తంటాలు పడ్డారు. అనంతరం వాటిని సేఫ్ డిపాజిట్‌లో పెట్టగా.. వాటికి కాపలాగా బ్యాంకర్స్ వున్నారు. అయితే కాయిన్స్ కొట్టేసేందుకు శుభశ్రీ సేఫ్ దగ్గరకొచ్చింది. ఈ నేపథ్యంలోనే శివాజీ, శుభశ్రీ గొడవ టెన్షన్ పుట్టించింది. శుభశ్రీకి చాలా దగ్గరగా శివాజీ వెళ్లగా.. అంత దగ్గరగా రావొద్దు ప్లీజ్ అని శుభశ్రీ రిక్వెస్ట్ చేసింది. దీంతో ఇది నా ప్రాపర్టీ అంటూ ఇంకా మీదకు వెళ్లాడు శివాజీ.. ప్లీజ్ వెనక్కి వెళ్లండి అంటూ ఆమె ఈసారి ఏకంగా దండం పెట్టింది. భోజనం చేస్తూ శివాజీ ప్రవర్తనను కెమెరాల వంక చూస్తూ బిగ్‌బాస్‌తో చెప్పుకొచ్చింది. బిడ్డ అంటూనే పైపైకి రావడం కరెక్ట్ కాదు.. ఓ ఆడపిల్ల దగ్గరకొచ్చి ఎటాక్ చేయడం కరెక్టా..? అది గేమ్ కాదు ఓవరాక్షన్ అని శివాజీ తీరుపై శుభశ్రీ ఆవేదన వ్యక్తం చేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments