Bigg Boss 7 Telugu : చీటింగ్ చేయలేదంటూ యావర్ కన్నీళ్లు .. టాస్క్‌ల్లో రెచ్చిపోయిన శివాజీ-ప్రశాంత్

  • IndiaGlitz, [Thursday,October 05 2023]

బిగ్‌బాస్‌లో 7 విజయవంతంగా ఐదో వారంలోకి ప్రవేశించింది. ఇప్పటికే నలుగురు ఇంటి సభ్యులు ఎలిమినేట్ అయ్యారు. కానీ ఇంత వరకు ప్రేక్షకులకు సరైన మజా లభించలేదు. ఉల్టా పల్టా అంటున్నా, వెరైటీ టాస్క్‌లు పెడుతున్నా ఫలితం కనిపించడం లేదు. అయితే ఈసారి బిగ్‌బాస్ తన శక్తివంతమైన అస్త్రాన్ని బయటకు తీశాడు. అదే కెప్టెన్సీ టాస్క్. కంటెస్టెంట్స్‌పై అజమాయిషీ చేయడంతో పాటు నామినేషన్‌ నుంచి మినహాయింపు ఇచ్చే .. కెప్టెన్ అయ్యేందుకు అంతా ఉత్సాహం చూపుతారు. ఇందుకోసం గొడవలు పడటం కూడా సర్వసాధారణ. గత బిగ్‌బాస్ సీజన్‌లలో జరిగింది ఇదే. నాలుగు వారాలు గడిచినా ఇంటికి కెప్టెన్సీ లేకపోవడంతో .. ఈసారి బిగ్‌బాస్ గట్టిగా డిసైడ్ అయ్యాడు.

దీనిలో భాగంగా కెప్టెన్సీ టాస్క్ మొదలెట్టాడు. ‘గెలిపించేది మీ నవ్వే’’ అనే టాస్క్ ఇచ్చాడు. ఈ సందర్భంగా గౌతమ్ - శుభశ్రీలకు ఫస్ట్ ప్లేస్ ఇవ్వడంపై సంచాలకులుగా వున్న యువర్, శోభాశెట్టిలపై కంటెస్టెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ ఆ గొడవ కంటిన్యూ అయ్యింది. అంతా కలిసి ప్రిన్స్ యావర్‌ మీద పడ్డారు. శుభశ్రీకి ఫేవర్‌గా యావర్ వ్యవహరించాడని ఆరోపించారు. అయితే తన తప్పు లేదని శివాజీకి అతను చెప్పే ప్రయత్నం చేశాడు. తాను ఎంత చెబుతున్నా ఎవ్వరూ వినకపోవడంతో యావర్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీంతో శివాజీ అతనిని ఓదారుస్తూ కనిపించాడు.

ఇక కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా ‘‘దొరికితే దొంగ దొరక్కపోతే దొర’’ అని రెండో పోటీ పెట్టాడు. ఇందులో భాగంగా యాక్టివిటీ రూంలో బిగ్‌బాస్ ఫ్రెండ్ నిద్రపోతుంటాడు. అతను తన దగ్గరి నుంచి ఎన్నో ఏళ్లుగా కొన్ని వస్తువులను తీసుకుని వాటిని తిరిగి ఇచ్చేవాడు కాదని.. మీరు ఈసారి వాటిని తీసుకుని రావాలని టాస్క్ ఇచ్చాడు. బిగ్‌బాస్ ఫ్రెండ్‌ను లేపకుండా ఆ వస్తువుల్ని తీసుకుని రావాలని ఆదేశించాడు. దీంతో ఇంటి సభ్యులంతా దొంగల్లా రెడీ అయి యాక్టివిటీ రూంలో చేసిన పనులు నవ్వు తెప్పించాయి. ఇంతలో బిగ్‌బాస్ షాకిచ్చాడు. తాను ఇచ్చిన టాస్క్‌ను తప్పుగా అర్ధం చేసుకున్నారని.. టాస్క్ అసలు స్వరూపాన్ని మార్చే స్వేచ్ఛ మీకు ఎంత మాత్రం లేదన్నారు. తాను చెప్పిన దానిని పట్టించుకోకుండా మీకు నచ్చినవన్నీ తీసుకొచ్చారని.. అడగనివి కూడా దొంగిలించారని బిగ్‌బాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కంటెస్టెంట్స్ తాము ఓడిపోతామేమో.. కెప్టెన్సీ రేసులో నిలబడలేమోనని భయపడ్డారు.

చివరిగా బిగ్‌బాస్ ఇచ్చిన తొలి కెప్టెన్సీ టాస్క్‌లో గౌతమ్, శుభశ్రీలు తొలిస్థానంలో నిలిచి మూడు స్టార్లు.. సెకండ్ ప్లేస్‌లో వున్న అమర్‌దీప్, గౌతమ్‌లు రెండు స్టార్లు.. థర్డ్ ప్లేస్‌లో నిలిచిన ప్రశాంత్, శివాజీకి ఒక స్థార్ కేటాయించారు. అలాగే దొరికితే దొంగ టాస్క్‌లో అనవసరమైన వస్తువులు తక్కువ తీసుకొచ్చిన శివాజీ , పల్లవి ప్రశాంత్‌లు విజయం సాధించారు. మూడవ కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా కంటెస్టెంట్స్‌కు ‘‘ఫ్రూట్ నింజా’’ అనే గేమ్ పెట్టాడు బిగ్‌బాస్. దీనిలో భాగంగా జోడీలోని ఒకరు.. దూరంలో వున్న మరొకరి తలపై వున్న బుట్టలో ఆరెంజ్ ఫ్రూట్ వేయాలి. అనంతరం అందులో పడిన ఫ్రూట్స్ నుంచి జ్యూస్ తీయాలి. ఎవరిదైతే ఎక్కువ జ్యూస్ వుంటుందో వారే విజేతలు. ఈ టాస్క్‌లో ప్రిన్స్ యావర్, టేస్టీ తేజలు గెలిచారు. మొత్తంగా పల్లవి ప్రశాంత్, శివాజీలు 5 స్టార్స్ సంపాదించి కెప్టెన్సీ పోటీలో విజేతలుగా నిలిచారు. వీరి మధ్య తొలి కెప్టెన్సీ పోటీ జరగనుంది.

More News

Pawan Kalyan:కేంద్రాన్ని ప్రశ్నించే దమ్ము జగన్‌కు లేదు.. పెడన వారాహి సభలో పవన్ విమర్శలు

కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే దమ్ము సీఎం జగన్‌కు లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు.

Chandra Babu:చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా

విజయవాడలోని ఏసీబీ కోర్టులో చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లపసై విచారణను రేపటికి వాయిదా వేస్తూ న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు.

Varalaxmi Sarathkumar:డ్రగ్స్ కేసులో నోటీసులంటూ ప్రచారం .. నా ఫోటోతో వార్తలు , ఏం జరిగిందంటే : క్లారిటీ ఇచ్చిన వరలక్ష్మీ

వరలక్ష్మీ శరత్ కుమార్.. ఈ తరంలోని అద్భుతమైన నటీమణుల్లో ఆమె కూడా ఒకరు.

Talasani Srinivas Yadav:చంద్రబాబు అరెస్టును తీవ్రంగా ఖండించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

టీడీపీ జాతీయాధ్యక్షులు చంద్రబాబు అరెస్టును తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు.

Nobel Prize:రసాయన శాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ అవార్డు

2023 సంత్సరానికి గాను వివిధ విభాగాల్లో సోమవారం నుంచి నోబెల్ అవార్డులు ప్రకటిస్తున్న రాయల్ స్వీడిష్ అకాడమి ఆఫ్ సైన్సెస్ ఇవాళ(బుధవారం)