ఆ వీడియోతో ఒక్కొక్కరి సంగతి తేలుస్తా.. చంపించేయండి..: శివాజీ
Send us your feedback to audioarticles@vaarta.com
టీవీ9 వివాదంలో మాజీ సీఈవో రవిప్రకాష్‌తో పాటు సినీ నటుడు శివాజీపై కూడా అలందమీడియా కేసులు పెట్టిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే రవిప్రకాష్ పోలీసు విచారణకు రాగా.. ఇంతవరకూ శివాజీ మాత్రం రాలేదు. దీంతో ఆయనకు లుక్ అవుట్ నోటీసులివ్వడం జరిగింది. ఈ నోటీసులిచ్చాక అమెరికాకు వెళ్లడానికి యత్నించగా ఆయన్ను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే తాజాగా మరోసారి దుబాయ్ మీదుగా అమెరికా వెళ్లాలని ప్రయత్నించాడని దీంతో ఆయన్ను పోలీసులు పట్టుకుని హైదరాబాద్ ఖాకీలకు అప్పగించారని తాజాగా టాక్ నడుస్తోంది. తూచ్.. ఇదంతా అబద్దమేనని శివాజీ చెబుతున్నాడు. అసలు తాను హైదరాబాద్ వదిలి వెళ్లలేదని అలాంటప్పుడు దుబాయ్‌లో తనను ఎలా పట్టుకుంటారని.. ఇదంతా టీవీ9 చేస్తున్న ఫేక్ వ్యవహారమని ఆయన చెబుతూ ఓ వీడియోను విడుదల చేశారు.
ఈ క్లిప్‌తో ఒక్కొక్కరి సంగతి తేలుస్తా..!
ఇలాంటి వార్తలతో టీవీ9 సంస్థ అధినేతలను వారికి సంబంధిత నేతలను ఏదో విధంగా సంతోష పెట్టడానికే పుకార్లు పుట్టిస్తున్నారని శివాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు అధికారులు సమాజ హితం కోసం పనిచేయాలే తప్ప.. ఇలా వ్యక్తుల కోసం పనిచేయకూడదని ఈ సందర్భంగా పోలీసులపై కన్నెర్రజేశారు. గతంలో పలుమార్లు అమెరికాకు వెళ్లానని.. అన్ని సార్లు కూడా లీగల్‌గా వెళ్లానన్నారు. తన గురించి అమెరికా పోలీసులకు బాగా తెలుసని.. తప్పు చేస్తే అమెరికాలో అడుగుపెట్టనిస్తారా..? అని ప్రశ్నించారు. తెలంగాణ పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శించడంతో ఈ వ్యవహారం అమెరికా దాకా వెళ్లిందన్నారు. అయితే రేపొద్దున కోర్టులో ఈ కేసుకు సంబంధించి టీవీ9 క్లిప్ చూపిస్తాని.. దీంతో ఒక్కొక్కరి సంగతి చెబుతానని శివాజీ వార్నింగ్ ఇచ్చారు. కోర్టులోనే ఈ కేసుపై తాడోపేడో తేల్చుకుంటానని తేల్చిచెప్పారు.
చంపేయండి ఇవన్నీ ఎందుకు!
తెలంగాణ వ్యాప్తంగా ఎన్నో కేసులున్నాయని.. మరీ ముఖ్యంగా సైబరాబాద్ స్టేషన్‌లో ఎన్నో కేసులున్నాయని వాటన్నింటిని పోలీసులు ఏం తేల్చారు..? వాటిని ఏ మాత్రం విచారించారు..? ఇంకా ఎన్నో కేసులు పెండింగ్ ఉన్నాయ్ వాటి సంగతేంటి..? అయినా తన కేసు ఏమైనా అంత పెద్దదా..? అని పోలీసులపై వరుస ప్రశ్నల వర్షం కురిపించారు. అంతటితో ఆగని ఆయన చట్టాన్ని ఇలా ఎందుకు వాడుకుంటున్నారని.. ‘నన్ను లీగల్‌గా పోలీసుల చేత చంపించేయండి. అలా చేస్తే మై హోం రామేశ్వర్ రావు, మెగా కృష్ణారెడ్డి, వారి అధినాయకుడు హ్యాపీగా ఫీలవుతారు’ అని ఒకింత ఆవేదనకు లోనవుతూ శివాజీ చెప్పుకొచ్చారు. అయితే ఈ వ్యాఖ్యలపై తెలంగాణ పోలీసులు, టీవీ9 సంస్థ అధినేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments