Bigg Boss Telugu 7 : హౌస్‌ను కనుసైగతో శాసించి.. చాణక్యుడిగా నిలిచి , బిగ్‌బాస్ చరిత్రలోనే శివాజీ రెమ్యూనరేషన్ ఓ రికార్డు

  • IndiaGlitz, [Monday,December 18 2023]

బిగ్‌బాస్ 7 తెలుగు సీజన్ 7 విజేతగా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ నిలిచిన సంగతి తెలిసిందే. పల్లవి ప్రశాంత్, శివాజీ, అమర్‌దీప్, అర్జున్ అంబటి, ప్రిన్స్ యావర్, ప్రియాంక జైన్‌లు ఫైనలిస్టులుగా నిలవగా.. వీరిలో ప్రేక్షకుల ఆమోదం పొందిన ప్రశాంత్ విన్నర్‌గా నిలిచాడు. అయితే ఈ సీజన్‌లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందిగా శివాజీ గురించి. సీనియర్ నటుడైన ఈయన తెలుగు ప్రజలకు సుపరిచితం. నిజానికి శివాజీకి హౌస్‌లో అడుగుపెట్టే నాటికి ఫుట్ నెగిటివిటీ వుంది. 50 ఏళ్ల వయసుతో పాటు పొలిటికల్‌గా యాక్టీవ్‌గా వుండే శివాజీని ఓ వర్గం టార్గెట్ చేస్తూ వుండేది. దీనికి తోడు వయసులో శివాజీకి దగ్గరగా వుండే షకీలా, కిరణ్ రాథోడ్‌లు తొలి రెండు వారాల్లోనే ఎలిమినేట్ కావడంతో అతను కూడా మూడు వారాలకు మించి వుండరని అంతా భావించారు.

కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ హౌస్ మొత్తాన్ని తన కనుసన్నల్లోనే నడిపిస్తూ చాణక్యుడిగా పేరు తెచ్చుకున్నాడు శివాజీ. ఎవరినైనా కెప్టెన్ చేయాలన్నా.. నామినేట్ చేసి బయటకు పంపాలన్నా శివాజీ చేతుల్లోనే వుండేదంటే అతిశయోక్తి కాదు. తొలుత శివాజీతో పెట్టుకున్న రతిక ఎలిమినేట్ అయ్యందన్న సంగతి అందరికీ తెలిసిందే. రీ ఎంట్రీ తర్వాత ఆమె శివాజీకి భజన బృందంగా మారిపోయిందంటే శివాజీ సత్తాను అర్ధం చేసుకోవచ్చు.

మైండ్ గేమ్ ఆడుతూ షోను రక్తికట్టించాడు శివాజీ . కాఫీ కోసం అల్లాడిపోయినా, ఎప్పుడూ సోఫాకే అతుక్కుపోయినా ఫైనల్ దాకా వచ్చాడు. చేతికి గాయమై మధ్యలోనే వెళ్లిపోతాడేమో అనుకున్నా పట్టుదలతో చివరి వరకు వచ్చాడు. ప్రశాంత్ , ప్రిన్స్ యావర్‌లకు సలహాలు , సూచనలు ఇస్తూ వారిని వెనకుండి నడిపించాడు. ప్రశాంత్, యావర్‌లను ప్రోత్సహించిన తీరుతో శివాజీకి పాజిటివ్ ఓటింగ్ పెరిగింది. హీరోగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్న శివాజీకి.. బిగ్‌బాస్ ద్వారా అంతకుమించి పేరొచ్చింది. టైటిల్ ఫేవరెట్లలో ఒకడిగా ప్రచారం పొందినప్పటికీ స్వల్ప ఓటింగ్‌తో మూడవ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ఎలిమినేట్ అని ప్రకటించగానే ప్రశాంత్ కన్నీటి పర్యంతమయ్యాడు. గురువు కాళ్ల మీద పడి అస్సలు వదల్లేదు. ప్రశాంత్, అమర్‌లకి ఆల్ ది బెస్ట్ చెప్పి తాను అన్నీ చూసేశానని , ఇక మీదే జీవితమని, గెలవాల్సింది మీరేనని వారికి హితబోధ చేశాడు. హౌస్‌ను వీడుతూ 105 రోజులు కడుపులో పెట్టుకుని కాపాడావ్, చల్లగా చూశావంటూ ఇంటికి దండం పెట్టాడు. స్టేజ్‌పైకి వెళ్లగానే నాగార్జున కాళ్లు మొక్కి .. ఇన్నాళ్లు వుంటానని అనుకోలేదని, ఎలాంటి పరిస్ధితులనైనా ఫేస్ చేయాలని తెలిసిందని, హౌస్‌ను, ఈ మైక్‌ను మిస్ అవుతానని అన్నాడు. కప్పు కొట్టకపోయినా కోట్లాది మంది అభిమానులను, వారి ప్రేమను సంపాదించుకున్నాడు.

ఇక శివాజీ రెమ్యూనరేషన్ కూడా బిగ్‌బాస్ చరిత్రలోనే ఓ రికార్డుగా అందరూ చెప్పుకుంటున్నారు. రోజుకు రూ.60 వేల చొప్పున అంటే వారానికి రూ.4.25 లక్షలు తీసుకున్న శివాజీ.. 15 వారాలకు గాను రూ.63.75 లక్షలు చార్జ్ చేసినట్లుగా తెలుస్తోంది. దీనిని బట్టి ఈ సీజన్‌లోని అందరు కంటెస్టెంట్స్‌ కంటే ఇదే ఎక్కువ రెమ్యూనరేషన్ శివాజీది. విజేత అయిన పల్లవి ప్రశాంత్‌కు రూ.35 లక్షల ప్రైజ్‌మనీ, దీనికి అదనంగా రూ.15 లక్షల గోల్డ్, రూ.12 లక్షల విలువైన కారు మొత్తం కలిపి రూ.62 లక్షలు వచ్చాయి. కానీ శివాజీ మాత్రం విన్నర్‌ను మించి రూ.63.75 లక్షలు అందుకుని జాక్‌పాట్ కొట్టాడు.

More News

Bigg Boss Telugu 7: అమర్‌దీప్‌కు ట్రోఫీ ఎందుకు దూరమైంది.. రన్నరప్‌గా నిలిచినా వచ్చింది సున్నా

బిగ్‌బాస్ 7 తెలుగు సీజన్ 7 విజేతగా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ నిలిచిన సంగతి తెలిసిందే. పల్లవి ప్రశాంత్, శివాజీ, అమర్‌దీప్, అర్జున్ అంబటి, ప్రిన్స్ యావర్, ప్రియాంక జైన్‌లు ఫైనలిస్టులుగా నిలవగా..

Chandrababu:చంద్రబాబును చెప్పుతో కొడతా.. టీడీపీ కార్యకర్త ఆగ్రహం..

ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. అభ్యర్థుల ఎంపికపై పార్టీలు దృష్టిపెట్టాయి. టికెట్ రాదని భావిస్తున్న కొంతమంది అభ్యర్థుల అనుచరులు

Amardeep: అన్నపూర్ణ వద్ద ఘర్షణ .. అమర్‌పై ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి, ఆ లేడి కంటెస్టెంట్ కారు అద్దాలు ధ్వంసం

15 వారాల పాటు తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన బిగ్‌బాస్ 7 తెలుగు ముగిసింది. అందరిని షాక్‌కు గురిచేస్తూ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచి, బిగ్‌బాస్ చరిత్రలో

Chandrababu-Lokesh:అప్పుడు చంద్రబాబు.. ఇప్పుడు లోకేశ్.. అక్కడే పాదయాత్ర ముగింపు..

టీడీపీ యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర నేటితో ముగియనుంది. ఇవాళ సాయంత్రం విశాఖ జిల్లాలోని అగనంపూడి వద్ద యాత్రను ముగించనున్నారు.

Pawan Kalyan:పవన్‌కల్యాణ్‌తో చంద్రబాబు భేటీ.. సీట్ల సర్దుబాటుపై సుదీర్ఘంగా చర్చ..

ఏపీలో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. ఎన్నికలు మూడు నెలలు మాత్రమే సమయం ఉండటంతో అన్ని పార్టీలు కదనరంగంలోకి దిగాయి.