రౌడీ హీరో కు తల్లిగా రాజమాత...?
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ మోస్ట్ పాపులర్ హీరో విజయ్ దేవరకొండ.... బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ అన్ని ఇండస్ట్రీల్లోనూ మంచి ఫాలోయింది ఉన్న హీరో. కో యాక్టర్స్ కూడా తన స్టైల్ కు పడిపోయారంటే .. రౌడీ భాయ్ క్రేజ్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. అర్జున్ రెడ్డితో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న ఈ హీరో... ప్రస్తుతం వాల్డ్ ఫేమస్ లవర్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. అయితే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పూరీ డెరెక్షన్ లో తెరకెక్కుతుండగా.... ఇప్పటికే ఈ సినిమాకు ఫైటర్ గా టైటిల్ ఖరారు చేశారు. ఈ మూవీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు చక్కర్లు కొడుతుంది.
బాహుబలి ఫేం రాజమాత శివగామి రమ్యకృష్ణ ఫైటర్ సినిమాలో విజయ్ కు తల్లి పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ముంబైలో నాలుగు నెలల పాటు జరగనున్న ఫైటర్ సినిమా షూటింగ్ కోసం ఇప్పటికే ఏర్పాట్లు జరిగినట్లు తెలుస్తోంది. ఇక్కడ షూటింగ్ పూర్తి కాగానే.. యూఎస్ లో మరో షెడ్యూల్ ప్లాన్ చేసిందట చిత్ర యూనిట్. ఇక విజయ్ సరసన నటించేందుకు శ్రీదేవి కూతురు జాహ్నవిని సంప్రదించారట.
గతంలో హలో సినిమాలో అఖిల్ కు తల్లి పాత్రలో కనిపించిన రమ్యకృష్ణ... ఇప్పుడు విజయ్ దేవరకొండకు అమ్మ పాత్రలో నటించడం రౌడీ ఫ్యాన్స్ కు శుభవార్తే. కాగా... ప్రస్తుతం పూరీ తనయుడు హీరోగా నటిస్తున్న రొమాంటిక్, కృష్ణవంశీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న రంగమార్తాండ సినిమాల్లో ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు శివగామి. ఇక రౌడీ భాయ్ విజయ్ వాల్డ్ ఫేమస్ లవర్ జనవరి 14 న విడుదలకు సిద్ధంగా ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments