'శివగామి' ట్రైలర్ విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
కన్నడంలో ఘనవిజయం సాధించిన నాని అనే హర్రర్ చిత్రాన్ని తెలుగులో శివగామిగా భీమవరం టాకీస్ బ్యానర్ పై నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ విడుదల చేస్తున్నారు. మనీష్ ఆర్య, ప్రియాంకరావు, బేబి సుహాసిని, బై జగదీష్, కల్పన, రాధ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ సుహాసిని కీలకపాత్రలో నటించారు. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను బుధవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో రసమయి బాలకిషన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా..
నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ ``బేబి సుహాసిని, సీనియర్ సుహాసినిల పెర్ఫార్మెన్స్ చిత్రానికి హైలెట్‌గా నిలుస్తుంది. తెలుగులో ప్రముఖ గాయని గీతామాదురి, ప్రముఖ సింగర్ గజల్ శ్రీనివాస్ కుమార్తె సంస్కృతి పాడటం విశేషం. హర్రర్ సినిమాల్లో శివగామి కొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేస్తుందని నమ్మకముంది`` అన్నారు.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీః సురేష్, సంగీతః త్యాగరాజ్-గురుకిరణ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ః డా.శివ వై.ప్రసాద్, సమర్పణః రమేష్ కుమార్ జైన్, నిర్మాతః తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంః సుమంత్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com