సూర్య సినిమాలో శివగామి..!
Send us your feedback to audioarticles@vaarta.com
సూర్య - కీర్తి సురేష్ జంటగా విఘ్నేష్ దర్శకత్వంలో రూపొందుతున్న తమిళ చిత్రం తాన సేరేంద కొట్టమ్. ఈ చిత్రాన్ని కె.ఇ జ్ఞానవేల్ రాజా స్టూడియో గ్రీన్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఇటీవల చెన్నైలో ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. యువ సంగీత దర్శకుడు అనిరుథ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. త్వరలో రెండో షెడ్యూల్ షూటింగ్ కి ప్లాన్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే...ఈ భారీ తమిళ చిత్రంలో బాహుబలిలో శివగామి పాత్రతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఓ ముఖ్యపాత్ర పోషిస్తుండడం విశేషం. ప్రస్తుతం రమ్యకృష్ణ బాహుబలి 2, కమల్ హాసన్ శభాష్ నాయుడు చిత్రాల్లో నటిస్తున్నారు. ఇప్పుడు సూర్య సినిమాలో రమ్యకృష్ణ నటిస్తుండడంతో ఈ చిత్రం పై అటు తమిళ్ లోను, ఇటు తెలుగులోను మరిన్ని అంచనాలు పెరగడం ఖాయం. అయితే...రమ్యకృష్ణ పాత్ర ఎలా ఉంటుంది అనేది తెలియాల్సి ఉంది. దాదాపు 80 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందే ఈ చిత్రాన్ని జులైలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments