'శివ‌కాశీపురం' మొద‌టి పాట విడుద‌ల‌

  • IndiaGlitz, [Saturday,October 14 2017]

సంగీత ద‌ర్శ‌కులు చ‌క్ర‌వ‌ర్తి మ‌న‌వ‌డు రాజేశ్ శ్రీ చ‌క్ర‌వ‌ర్తి క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ సాయి హ‌రేశ్వ‌ర ప్రొడ‌క్ష‌న్స్ పై హ‌రీష్ వ‌ట్టి కూటి ద‌ర్శ‌క‌త్వంలో మోహ‌న్ బాబు పులిమామిడి నిర్మిస్తోన్న చిత్రం 'శివ‌కాశీపురం'. ప్రియాంక శ‌ర్మ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ప‌వ‌న్ శేష సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలోని తొలి పాట‌ను శుక్ర‌వారం సాయంత్రం హైద‌రాబాద్ లోని ఎఫ్‌.ఎమ్ స్టేష‌న్ లో రిలీజ్ చేశారు. అలాగే మిగిల‌న సింగిల్స్ ఒక్కొక్క‌టిగా మార్కెట్ లోకి రానుంది.

ఈసంద‌ర్భంగా చిత్ర నిర్మాత మోహ‌న్ బాబు పులి మామిడి మాట్లాడుతూ, " గ్రామీణ నేప‌థ్యంలో సాగే అంద‌మైన ప్రేమ క‌థా చిత్ర‌మిది. మా చిత్రంతో సంగీత దిగ్గ‌జం చ‌క్ర‌వ‌ర్తి గారి మ‌న‌వ‌డు రాజేశ్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్నాడు. అత‌నికి తొలి సినిమా అయినా చ‌క్క‌గా న‌టించారు. హీరోయిన్ ప్రియాంక న‌ట‌న‌, పాట‌లు హైలైట్ గా ఉంటాయి. ఇటీవ‌లే షూటింగ్ కూడా పూర్తిచేశాం. తెలంగాణ జిల్లాలో షూటింగ్ జ‌రిపాం. మంచి అవుట్ ఫుట్ వ‌చ్చింది. ద‌ర్శ‌కుడు అనుక‌న్న‌ది అనుకున్న‌ట్లుగా చిత్రీక‌రించారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. దీపావ‌ళి కానుక‌గా టీజ‌ర్ ను రిలీజ్ చేస్తాం. అనంత‌రం ప్రీ రిలీజ్ వేడుక‌ను గ్రాండ్ జ‌రుపుతాం. మిగతా ప‌నులు కూడా పూర్తిచేసి వ‌చ్చే నెల‌లో సినిమా రిలీజ్ చేస్తాం. మా చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కులంతా ఆద‌రిస్తార‌ని కోరు కుంటున్నా" అని అన్నారు.

చిత్ర ద‌ర్శ‌కుడు హ‌రీష్ మాట్లాడుతూ, " సైకాలాజిక‌ల్ థ్రిల్ల‌ర్ టీనేజ్ ల‌వ్ స్టోరీ ఇది. కొన్ని వాస్త‌వ సంఘ‌ట‌న‌లు ఆధారంగా తెర‌కెక్కించాం. ప్ర‌తీ స‌న్నివేశం వైవిథ్యంగా ఉంటుంది. అంతా కొత్త వాళ్లైనా చ‌క్క‌గా న‌టించారు. మంచిర్యాల‌, ఆర్ .కె పు రం త‌దిత‌ర తెలంగాణ ప్రాంతంలోనే చిత్రీక‌రించాం. అలాగ‌ని ఇది తెలంగాణ మూవీ కాదు. యూనివర్శ‌ల్ పాయింట్ తెరెక్కించిన‌ది. చ‌మ్మ‌క్ చంద్ర‌, జ‌బ‌ర్ ద‌స్త్ రామ్ కామెడీ స‌న్నివేశాలు క‌డుపుబ్బా నవ్విస్తాయి. అన్ని వ‌ర్గాల వారికి త‌ప్పుకుండా మా సినిమా న‌చ్చుతుంది" అని అన్నారు.

హీరో రాజేష్ మాట్లాడూతూ, "నువ్వు చాలా హాట్' అనే షార్ట్ ఫిలిం లో న‌టించా. అందులో నా న‌ట‌న చూసి ద‌ర్శ‌కులు అవ‌కాశం ఇచ్చారు. ఇందులో ఆటో డ్రైవ‌ర్ పాత్ర‌లో న‌టిస్తున్నా. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే చ‌క్కని ప్రేమ క‌థ‌. హీరో, హీరోయిన్ మ‌ధ్య ల‌వ్ స్టోరీ ఆస‌క్తి క‌రంగా ఉంటుంది. రొమాంటిక్ స‌న్నివేశాలున్నాయి. అలాగ‌ని యువ‌త‌కే పరిమిత‌మ‌య్యే సినిమా కాదు. కుటుంబ స‌మేతంగా చూడ‌ద‌గ్గ చిత్రం" అని అన్నారు.

సంగీత ద‌ర్శ‌కుడు ప‌వ‌న్ శేష మాట్లాడుతూ, "గులాబీ, ల‌వ్ స్టేట్స్ చిత్రాల‌కు సంగీతం అందించా. ఇది నాకు మూడ‌వ సినిమా. మొత్తం నాలుగు పాట‌లున్నాయి. సంగీతానికి ఎక్కువ స్కోప్ ఉన్న చిత్రం. శ‌త‌మానంభ‌వ‌తి త‌ర్వాత ఎస్. పి.బాల‌సుబ్ర‌మ‌ణ్యంగా రు మా కోసం ఇందులో ఒక పాట పాడారు. అది హైలైట్ గా ఉంటుంది. సినిమా త‌ప్ప‌కుండా పెద్ద విజ‌యం సాధిస్తుంది" అని అన్నారు.

చ‌మ్మ‌క్ చంద్ర‌, సూర్య‌, జ‌బ‌ర్ ద‌స్త్ రాము, దిల్ ర‌మేష్‌, న‌వీర్ జ‌బ‌ర్ ద‌స్త్, ల‌క్ష్మీ, ర‌వీంద్ర‌, మాస్ట‌ర్ హ‌రి, హ‌రికృష్ణ పులిమామిడి త‌దిత‌రులు న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : ప‌వ‌న్ శేష‌, కెమెరా : జి. రామిరెడ్డి, ఎడిటింగ్: జియోజిథామ‌న్, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్: అక్క‌ల చంద్ర‌మౌళి, నిర్మాత మోహ‌న్ బాబు పులిమామిడి, రచ‌న‌, ద‌ర్శ‌క‌త్వం హ‌రీష్ వ‌ట్టికూటి.