'బీస్ట్' నెల్సన్ దర్శకత్వంలో 'డాక్టర్ వరుణ్' గా శివ కార్తికేయన్

  • IndiaGlitz, [Wednesday,September 22 2021]

శివకార్తికేయన్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెలుగు - తమిళ భాషల్లో తెరకెక్కిన చిత్రం ' డాక్టర్' . ఈ చిత్రాన్ని విజయదశమి సందర్బంగా అక్టోబర్ 9th న తెలుగునాట ప్రేక్షకుల ముందుకి తీసుకురానున్నారు. కే. జె. ఆర్ స్టూడియోస్ కోటపాడి జే రాజేష్ ఈ చిత్రాన్ని గంగ ఎంటర్టైన్మెంట్స్ , ఎస్ కె ప్రొడక్షన్స్ తో సంయుక్తంగా నిర్మించారు.

ఇదివరకే విడుదలైన తమిళ పాటలు, అనిరుధ్ సంగీతం చిత్రంపై విపరీతమైన అంచనాలు పెంచగా, తెలుగులో కూడా పాటల్ని త్వరలోనే విడుదల చేయనున్నారు. ‘గ్యాంగ్ లీడర్’ ఫేమ్ ప్రియాంక అరుల్ మోహన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించగా , వినయ్ రాయ్ విలన్ గా చేశారు.

ఈ సందర్బంగా నిర్మాత కోటపాడి జె రాజేష్ మాట్లాడుతూ, “మా చిత్రం మంచి మాస్ ఎంటర్టైనర్. ప్రస్తుతం విజయ్ హీరోగా ‘బీస్ట్ ‘ చిత్రాన్ని చేస్తున్న నెల్సన్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. శివకార్తికేయన్ తో ఇదివరకు మేము తీసిన 'శక్తి' అనే చిత్రం మంచి హిట్ అయ్యి మాకు లాభాల పంట పండించింది. ఈ చిత్రం కూడా అలాగే సూపర్ హిట్ అవుతుందని ఆశిస్తూ అక్టోబర్ 9th న ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నాం. ప్రేక్షకుల అంచనాలని మించి ఈ చిత్రం ఉంటుందని మాత్రం కచ్చితంగా చెప్పగలం అన్నారు

డైరెక్టర్ నెల్సన్ మాట్లాడుతూ- శివకార్తికేయన్ - అనిరుధ్ కాంబినేషన్ తో మంచి మాస్ ఎంటర్టైనర్ కథతో తెరకెక్కిన చిత్రం ఇది. డాక్టర్ వరుణ్ గా శివ కార్తికేయన్ నవరసాలు చూపించారు. ఎన్నో ఒడిదుడుకుల తరువాత చిత్రం థియేటర్స్ లో అక్టోబర్ 9th న విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకులని నూటికి నూరు శాతం అలరిస్తుంది.ప్రస్తుతం విజయ్ తో ‘బీస్ట్’ చిత్రం చేస్తున్నా అన్నారు.

More News

దగ్గుబాటి బాబాయ్ - అబ్బాయ్ కలయికలో 'రానా నాయుడు'... త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

విక్టరీ వెంకటేశ్, రానా కలిసి నటిస్తే చూడాలన్నది దగ్గుబాటి అభిమానుల కల ఇన్నాళ్లకు నెరవేరనుంది. గతంలో రానా నటించిన ‘కృష్ణం వందే జగద్గురుం’ చిత్రంలో వెంకటేశ్ అతిథి పాత్రలో అలరించాడు.

బిగ్‌బాస్ 5 తెలుగు: ప్రియ, హమీదల మధ్య బాడీ షేమింగ్ రచ్చ... 'హగ్' కామెంట్స్‌పై లహరికి ప్రియ క్షమాపణలు

బిగ్‌బాస్ హౌస్‌లో ఈరోజు కూడా నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. కంటెస్టెంట్లు ఒకరిపై ఒకరు కామెంట్లు చేసుకోవడంతో హౌస్ హీటెక్కిపోయింది. ప్రతి ఒక్కరు విషయాన్ని పర్సనల్‌గా తీసుకోవడం, ఎఫైర్

మెగాస్టార్ చిరంజీవి విడుద‌ల చేసిన ‘రిప‌బ్లిక్‌’ ట్రైల‌ర్‌

మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా బుధ‌వారం ‘రిప‌బ్లిక్‌’ ట్రైల‌ర్ విడుద‌లైంది. సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా న‌టించిన ఈ పొలిటికల్ థ్రిల్ల‌ర్‌ను దేవ క‌ట్టా డైరెక్ట్ చేశారు.

ద‌స‌రాకు థియేట‌ర్స్‌లో సంద‌డి చేయ‌నున్న రాఘవేంద్రరావు ‘పెళ్లిసంద‌D’... సెన్సార్ పూర్తి

ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రూపొందుతున్న‌ చిత్రం ‘పెళ్లి సంద‌D’. ఎన్నో బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాల రూప‌క‌ల్ప‌న‌లో

నాగార్జున మామను కాస్తా... జస్ట్ నాగార్జునగా మార్చిన సమంత, ఆ ట్వీట్ వెనుక ఆంతర్యం ఏమిటీ..?

గడిచిన రెండు మూడు నెలలుగా సమంత, నాగ చైతన్య వైవాహిక జీవితంపై రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి . సోషల్ మీడియా కథనాలపై అటు నాగ చైతన్య కానీ, ఇటు సమంత కానీ ఖండించడం లేదు.