శివ జొన్నలగడ్డ హీరోగా స్వీయ దర్శకత్వంలో 'మాస్ పవర్ ' ప్రారంభం

  • IndiaGlitz, [Friday,August 04 2017]

స‌ర్వేశ‌ర మూవీస్ ప‌తాకంపై శివ జొన్న‌ల‌గ‌డ్డ హీరోగా స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో గుద్దేటి బ‌స‌వ‌ప్ప మేరు నిర్మిస్తోన్న 'మాస్ ప‌వ‌ర్' చిత్రం గురువారం హైద‌రాబాద్ ఫిలిం ఛాంబ‌ర్ లో ప్రారంభ‌మైంది. ముహూర్త‌పు స‌న్నివేశానికి పారిశ్రామిక వేత్త సారిప‌ల్లి కొండ‌ల‌రావు క్లాప్ నివ్వ‌గా, నిర్మాత తుమ్మ‌ల‌ప‌ల్లి రామ‌స‌త్యనారాయ‌ణ కెమెరా స్విచాన్ చేయ‌గా, ముత్యాల రామ‌దాసు తొలి స‌న్నివేశానికి గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. స్ర్కిప్ట్ ను ప్ర‌స‌న్న కుమార్, వి. సాగ‌ర్ అందించారు.

అనంత‌రం చిత్ర ద‌ర్శ‌క‌, హీరో శివ జొన్న‌ల‌గ‌డ్డ మాట్లాడుతూ, ' ఇటీవ‌ల బ‌స‌వ‌ప్ప గారు, నా కాంబినేష లో తెర‌కెక్కిన 'పోలీస్ ప‌వ‌ర్' పెద్ద విజ‌యం సాధించింది. మ‌ళ్లీ ఇదే క‌ల‌యిక‌లో రెండ‌వ సినిమాగా 'మాస్ ప‌వ‌ర్' తెర‌కెక్కంచ‌డం సంతోషంగా ఉంది. కాల‌నీలో ఒక హౌస్ ను ఓ పొలిటిక‌ల్ లీడ‌ర్ క‌బ్జా చేస్తే? ఎలాంటి ప‌రిణామ‌లు చోటు చేసుకుంటాయి. తిరిగి ఆ హౌస్ ను హీరో ఎంత‌టి క్షేమంగా అప్ప‌గించాడ‌న్న‌దే చిత్ర క‌థ‌. నా స్టైల్లో ప‌క్కా మాస్ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్కిస్తున్నాం. టెక్నిక‌ల్ గానూ సినిమా హైలైట్ గా ఉంటుంది. యాక్ష‌న్ స‌న్నివేశాలు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తాయి. నిర్మాత ఖ‌ర్చు కు ఎక్క‌డా వెనుక‌డాకుండా నిర్మించ‌డానికి రెడీగా ఉన్నారు' అని అన్నారు.

చిత్ర నిర్మాత గుద్దేటి బ‌స‌వ‌ప్ప మేరు మాట్లాడుతూ, ' మా తొలి చిత్రం పోలీస్ ప‌వ‌ర్ ను పెద్ద హిట్ చేసిన ప్రేక్ష‌కులంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు. ఇదే క‌థ హిందీ, త‌మిళ రైట్స్ కూడా అమ్మ‌డు పోయాయి. మ‌ళ్లీ ఇప్పుడు మాస్ ప‌వ‌ర్ తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాం. ఇది ప‌క్కా పవ‌ర్ ఫుల్ మాస్ అంశాలున్న ఫ్యాకెజ్డ్ మూవీ. ఐదు పైట్ల‌ను, పాట‌ల‌ను ఐదుగురు ఫైట్ మాస్ట‌ర్లు, కొరియోగ్రాఫ‌ర్ల‌తో కంపోజ్ చేయిస్తున్నాం. ఈనెల 10నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ వెళ్తాం. అన్ని ప‌నులు పూర్తిచేసి వీలైనంత త్వ‌ర‌గా సినిమా విడుద‌ల చేస్తాం. పోలీస్ ప‌వ‌ర్ 50 రోజులు ఆడింది. ఇక మాస్ ప‌వ‌ర్ 100 రోజులు ఆడుతుందన్న న‌మ్మ‌కం ఉంది' అని అన్నారు.

తుమ్మ‌ల‌ప‌ల్లి రామ‌స‌త్యానారాయ‌ణ మాట్లాడుతూ, ' సినిమా ఇండ‌స్ర్టీ బాగుండాలంటే చిన్న సినిమాలు విజ‌యం సాధించాలి. అప్పుడే ఇండ‌స్ర్టీ స‌క్సెస్ రేటు పెరుగుతుంది. పోలీస్ ప‌వ‌ర్ పెద్ద విజ‌యం సాధించ‌డం సంతోషంగా ఉంది. త‌మిళ‌, హిందీ రైట్స్ కూడా సినిమా అమ్మ‌డు పోయిందంటే సినిమా స్టామినో ఏంటో అర్ధ‌మ‌వుతుంది' అని అన్నారు.

సారిప‌ల్లి కొండ‌ల‌రావు మాట్లాడుతూ, ' శివ క‌ష్ట‌ప‌డి పైకి వ‌చ్చాడు. పోలీస్ ప‌వ‌ర్ లో మాస్ హీరోగా అంద‌ర్నీ ఆక‌ట్టుకున్నాడు. మళ్లీ అలాంటి కంటెంట్ తోనే ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. ఇక నిర్మాత అత‌నికి కావాల్సిన‌వ‌న్నీ అందిస్తున్నారు. ఈ సినిమా కూడా పెద్ద విజ‌యం సాధించాలి' అని అన్నారు.

ఇందులో హీరోయిన్ గా ప్రియ‌చైత‌న్య న‌ట‌స్తుంది. అలాగే ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌స‌న్న కుమార్, చిత్ర యూనిట్ స‌భ్యులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: కె. శివ‌, ఫైట్స్: మ‌ల్లేష్ యాద‌వ్, స‌భా, కొరియోగ్ర‌ఫీ: బాల‌కృష్ణ‌, రామారావు, పాట‌లు: రుద్రంగి ర‌మేష్, శివ జోన్న‌ల‌గ‌డ్డ‌, నిర్మాత‌: గుద్దేటి బ‌స‌వ‌ప్ప‌, క‌థ‌, మాట‌లు, సంగీతం, స్ర్కీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: శివ జొన్న‌ల‌గ‌డ్డ‌