Siva Balaji: 'సిందూరం' సినిమా కోసం మొదటిసారి నక్సలైట్ పాత్రలో నటించాను : శివ బాలాజీ

  • IndiaGlitz, [Monday,December 26 2022]

శివ బాలాజీ, ధర్మ, బ్రిగిడా సాగ ప్రధాన తారాగణంగా శ్యామ్ తుమ్మలపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం సిందూరం. జనవరి 26న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ సందర్భంగా శివ బాలజీతో స్పెషల్ ఇంటర్వ్యూ.

డైరెక్టర్ శ్యామ్ తుమ్మలపల్లి వచ్చి సిందూరం సినిమా కథ చెప్పినప్పుడు బాగా నచ్చింది. ఈ సినిమా జానర్ విన్నప్పుడు ఇదొక ఇంటెన్స్ జానర్ అనిపించింది. కొన్ని సన్నివేశాలు చేస్తున్నప్పుడు కాంట్రవర్సీ అవుతుందేమో అనిపించింది. డైరెక్టర్ బాగా రీసెర్చ్ చేసి ఈ కథ రాసుకున్నారు. నేను మొదటిసారిగా నక్సలైట్ గా కనిపించబోతున్న సిందూరం సినిమా కొత్త కథ, కథనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

నక్సల్స్ పాయింట్ తో ఉద్యమం నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. హిస్టరీలో జరిగిన కొన్ని రియాలిటీ సన్నవేశాలను సిందూరం సినిమాలో చూపించడం జరిగింది. ఉద్యమ నేపథ్యం, రాజకీయం, ప్రేమకథ ఇందులో ఉంటాయి. ఓవర్ఆల్ గా ఇది నక్సల్ ఇన్ఫార్మర్ కథగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సిందూరం ఒక హై ఇంటెన్స్ సినిమాగా చెప్పుకోవచ్చు.

ఒక నిజాన్ని అందరికి అర్థం అయ్యే విధంగా ఈ సినిమాలో చూపించడం జరిగింది. ప్రతి ఆర్టిస్ట్ చాలా ఫోకస్ తో ఈ సినిమా చేశారు. తమిళ్ లో ఆల్రెడీ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న బ్రిగిడ ఈ సినిమాతో తెలుగులో లాంచ్ అవుతోంది. హీరో ధర్మ మహేష్ ఫస్ట్ సినిమా అయినా సరే చాలా నేచురల్ గా చేశాడు, కిషోర్ డైలాగ్స్ బాగా కుదిరాయి. నిర్మాత ప్రవీణ్ కు ఉన్న కాన్ఫిడెన్స్, డైరెక్టర్ శ్యామ్ కు ఉన్న నాలెడ్జ్ సిందూరం సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకొని వెళ్లాయి. సిందూరం లాంటి కథతో సినిమా రావాలంటే మరో 10 - 15 సంవత్సరాలు తప్పకుండా పడుతుంది. అలాంటి కథ ఇది. సంగీత దర్శకుడు హరి గౌరవ మ్యూజిక్ ఈ సినిమాకు మరో అసెట్ అవుతుంది.

నటీనటులు: శివ బాలాజీ, ధర్మ, బ్రిగిడ సాగ(పవి టీచర్)

More News

Naveen Polishetty: స్టాండప్ కమెడియన్ పాత్రలో నవీన్ పోలిశెట్టి, బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల

యంగ్ టాలెంట్ నవీన్ పోలిశెట్టి, అందాల తార అనుష్క శెట్టి హీరో హీరోయిన్లుగా యూవీ క్రియేషన్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది.

Tollywood: నేనొచ్చేశా, బీ రెడీ అంటోన్న కరోనా.. టాలీవుడ్‌లో మొద‌లైన‌ టెన్ష‌న్‌?

కరోనా కారణంగా అన్ని రంగాలు తీవ్రంగా ప్రభావితమైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా చిత్ర పరిశ్రమ కష్టాలు అన్నీ ఇన్ని కావు.

Trisha Krishnan : కాంగ్రెస్‌లోకి  త్రిష.. తమిళనాట కలకలం, పొలిటికల్ ఎంట్రీపై ఆమె ఏమన్నారంటే..?

భారతదేశంలో సినీ తారలకు రాజకీయాలకు విడదీయరాని అనుబంధం వుంది.

Rewind 2022: భారీ అంచనాలతో వచ్చి బోల్తా పడ్డ చిత్రాలు

ప్రతీ ఏడాది ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతూ వుంటాయి. కానీ వాటిలో కొన్ని మాత్రమే విజయం సాధిస్తూ వుంటాయి.

Chalapati Rao: రోజుల వ్యవధిలో మరో విషాదం... నటుడు చలపతిరావు కన్నుమూత, షాక్‌లో టాలీవుడ్

2022వ సంవత్సరం తెలుగు చిత్ర పరిశ్రమకు చేదు జ్ఞాపకాలను మిగులుస్తోంది. ఒకరి వెంట ఒకరిని సినీ దిగ్గజాలను తనతో పాటు తీసుకుపోతోంది.