ఎంత ఫాస్ట్‌గా స్కూళ్లను తెరిచారో.. అంతే ఫాస్ట్‌గా మూసేశారు..!
Send us your feedback to audioarticles@vaarta.com
ముందూ వెనుక ఆలోచన లేకుండా గవర్నమెంట్ చేసిన పనికి ప్రస్తుతం అటు ఉపాధ్యాయులు.. ఇటు విద్యార్థులు.. తద్వారా తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. చలికాలంలో కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని.. అప్రమత్తంగా ఉండాలని నిపుణులు ఎప్పటి నుంచో సూచిస్తున్నారు. అయినా అవేమీ పట్టించుకోకుండా గవర్నమెంట్.. స్కూళ్లకు పర్మిషన్ ఇచ్చేసింది. దీంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇటీవలే పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి. తెరుచుకుని కొద్ది రోజులు గడవక ముందే ఉపాధ్యాయ సిబ్బంది.. విద్యార్థులు పెద్ద సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారు.
దీంతో తిరిగి స్కూళ్లను మళ్లీ మూసివేసే దిశగా అధికారులు ఆలోచిస్తున్నారు. నవంబరు 2 నుంచి దేశంలోని పలు రాష్ట్రాలలో పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రారంభమైన కొద్ది రోజుల నుంచే ఉపాధ్యాయులు.. విద్యార్థులు పెద్ద సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారు. ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్‌లలోని స్కూళ్లలో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కారణంగా ఒక ఉపాధ్యాయుడు మృతి చెందారు. ఈ క్రమంలోనే ఎంత ఫాస్ట్‌గా పాఠశాలలను తెరిచారో.. అంతే త్వరగా మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇప్పటికే హిమాచల్‌ప్రదేశ్‌లో ఇటీవలే తెరిచిన స్కూళ్లను తిరిగి మూసివేశారు. ఇక్కడ స్కూళ్లను తెరిచిన నాలుగు రోజుల వ్యవధిలోనే దాదాపు 100 మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. ఉత్తరాఖండ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో కూడా పెద్ద మొత్తంలో ఉపాధ్యాయులు కరోనా బారిన పడటంతో అక్కడ కూడా స్కూళ్లను మూసివేశారు. మిజోరంలో అక్టోబర్‌లోనే పాఠశాలలను తెరిచారు కానీ పెద్ద మొత్తంలో విద్యార్థులు కరోనా బారిన పడటంతో అక్కడి పాఠశాలలను సైతం వెంటనే మూసివేశారు. ఒడిశాలో కరోనా సెకెండ్ వేవ్‌పై అనుమానంతో ప్రభుత్వం పాఠశాలలను తెరవాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout