Venky Atluri:టాలీవుడ్‌లో సెన్సేషనల్ : వెంకీ అట్లూరితో దుల్కర్ సల్మాన్.. ఈసారి అంతకుమించి..!!
Send us your feedback to audioarticles@vaarta.com
దుల్కర్ సల్మాన్.. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కుమారుడు. తన మాతృభాషలో సినిమాలు చేస్తూ ప్రస్తుతం పాన్ ఇండియా ప్రభంజనం కారణంగా దేశంలోని అన్ని ప్రాంతాలకు ఆప్తుడిగా మారిపోయారు. లవ్, రొమాంటిక్ జోనర్స్‌లో సినిమాల స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్న దుల్కర్‌కు యూత్‌లో మంచి ఫాలోయింగ్ వుంది. ఇక మహానటి, సీతారామం సినిమాలతో ఆయన తెలుగువారికి బాగా దగ్గరయ్యారు. తన కెరీర్‌లో భారీ బ్లాక్ బస్టర్‌లను అందించిన తెలుగు వారంటే ఆయనకు ఎంతో ప్రేమ. ఈ విషయాన్ని పలు వేదికలపైనా దుల్కర్ ప్రకటించారు. ఈ క్రమంలోనే ఆయన మరో తెలుగు దర్శకుడితో సినిమా చేయనున్నారు.
అక్టోబర్‌లో సెట్స్‌పైకి :
తొలి ప్రేమతో దర్శకుడిగా పరిచయమైన వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ సినిమా చేయనున్నారు. ఇది కొన్ని రోజులుగా ఫిలిం సర్కిల్స్‌లో వినిపిస్తోంది. చివరికి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు నిర్మించనున్నారు. ఈ మేరకు ఆదివారం సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. అంతేకాదు.. వెంకీ అట్లూరి, దుల్కర్ సల్మాన్‌లతో నిర్మాత నాగవంశీ వున్న ఫోటోను ఈ సందర్భంగా షేర్ చేశారు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయని చిత్ర యూనిట్ వెల్లడించింది. అక్టోబర్‌లో ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్తామని పేర్కొంది.
వెంకీ - దుల్కర్ కాంబోపై భారీ అంచనాలు :
కోలీవుడ్ స్టార్ ధనుష్‌తో వెంకీ తెరకెక్కించిన ‘‘సార్’’ తెలుగు, తమిళ భాషల్లో వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే. అంతటి బ్లాక్ బస్టర్ తర్వాత వెంకీ టేకప్ చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇక.. దుల్కర్ సల్మాన్ - అభిలాష్ జోషి దర్శకత్వంలో కింగ్ ఆఫ్ కోథాలో నటిస్తున్నారు. ఇందులో ఆయన సరసన ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్ట్ 24న ఈ సినిమా విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments