ఫంటాస్టిక్ తార’కు బ్రాండ్ అంబాసిడర్‌గా సితార
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్‌ల ముద్దుల తనయ సితార ఎంత యాక్టివ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వివిధ సందర్భాల్లో తండ్రితో కలిసి చేసిన వీడియోలు.. ఆమె నృత్యం చేస్తున్నప్పుడు తీసిన వీడియోలు ఎన్నో సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటాయి. ఓ సినిమా రిలీజ్‌కు ముందు కూడా సితార తన తండ్రిని ఇంటర్వ్యూ చేసి మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం సితార ఓ 3డీ యానిమేషన్ వెబ్ సిరీస్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా మారింది. ఫంటాస్టిక్ తార అనే వెబ్ సిరీస్‌కు సితార బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగనుంది.
ఈ వెబ్‌సిరీస్‌కి సంబంధించిన పోస్టర్‌ను బుధవారం రాత్రి మాదాపూర్‌లోని ఓ హోటల్లో నమ్రతా శిరోద్కర్, బాలీవుడ్ నటి నేహా ధూపియా, తెలంగాణా ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తదితరుల సమక్షంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా సితార మాట్లాడుతూ.. బ్రాండ్ అంబాసిడర్‌గా మారడం పట్ల చాలా ఆనందంగా ఉందని తెలిపింది. తన స్నేహితురాలు తార తనతో పాటుగా ఎదగనుందని చెప్పింది. ఈ సిరీస్ మొదటి సీజన్ ఏప్రిల్‌లో విడుదల చేయనున్నామని నిర్మాతలు నయన్, మనీష్, డైరెక్టర్ రాజేంద్ర తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments