క్లాసిక్ సితార కాదంటున్నారు మరి...
- IndiaGlitz, [Sunday,September 06 2015]
జీనస్ ఫిలింస్ బ్యానర్‌పై సురేంద్ర జి.ఎల్ దర్శకత్వంలో రవికుమార్ డి.ఎస్. నిర్మించే చిత్రం సితార. రవిబాబు, రవనీత్ కౌర్, సుమన్ ప్రధానపాత్రల్లో నటించారు. ఘంటాడి కృష్ణ, రామ్ పైడిశెట్టి సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదలైంది. బిగ్ సీడీని కవిత, ప్రతాని రామకృష్ణ గౌడ్, ఆడియో సీడీలను దర్శకుడు సూర్య కిరణ్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా...
దర్శకుడు సురేంద్ర జి.ఎల్ మాట్లాడుతూ 'గతంలో వచ్చిన సితార సినిమాతో పోల్చితే మా సితార చాలా భిన్నంగా ఉంటుంది. క్రైమ్ బేస్ మూవీ. సుమన్ గారు చాలా కీలకమైన పాత్రలో నటించారు. రవిబాబుగారిని డైరెక్ట్ చేయగలమా, లేదా అని ఆలోచించేవాడిని అయితే ఆయన చేసిన సపోర్ట్ తో నా కాన్ఫిడెంట్ పెరిగింది. రవిబాబుగారు చేయని ఓ డిఫరెంట్ క్యారెక్టర్ లో కనపడతారు. సినిమా కూడా టెక్నికల్ గా కొత్తగా ఉంటుంది. నిర్మాతగారు ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ఘంటాడి, రామ్ పైడి శెట్టి మంచి మ్యూజిక్ అందించారు. మా ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాం'' అన్నారు.
నిర్మాత రవికుమార్ డి.ఎస్. మాట్లాడుతూ 'దర్శకుడు సురేంద్ర కథ చెప్పిన దాని కంటే సినిమాని బాగా డైరెక్ట్ చేశాడు. ఘంటాడి కృష్ణ, రామ్ పైడిశెట్టి మంచి మ్యూజిక్ ఇచ్చారు. సినిమా బాగా వచ్చింది'' అన్నారు.
సంగీత దర్శకుడు ఘంటాడి కృష్ణ, రామ్ పైడి శెట్టి మాట్లాడుతూ 'సినిమాకి మంచి సంగీతం కుదిరింది. దర్శకుడు మంచి క్లారిటీతో సినిమాని డైరెక్ట్ చేయించాడు. నిర్మాతగారు ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. మంచి సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది'' అన్నారు.
ఈ కార్యక్రమంలో సుమన్, ప్రతాని రామకృష్ణ గౌడ్, సాయి వెంకట్, అశ్విన్, రవనీత్ కౌర్, జి.సుధాకర్ నాయుడు, కృష్ణ భగవాన్, కౌశిక్ బాబు, క్రాంతి, కవిత, నాగేష్, సుమన్ తదితరులు పాల్గొన్ని యూనిట్ ను అభినందించారు.
పరుచూరి గోపాలకృష్ణ, ఆశ్విన్, కృష్ణభగవాన్, సూర్య, చిత్రం శ్రీను, డి.వి, కిషోర్ దాస్, వివేక్ తదితరులు ఇతర తారాగణంగా నటించారు. ఈ చిత్రానికి ఆర్ట్: కృష్ణ భాస్కర్, ఎడిటింగ్: నందమూరి హరి, పాటలు: ఘంటాడి, వేణు కట్టా, రామ్ పైడిశెట్టి, సంగీతం: ఘంటాడి కృష్ణ, రామ్ పైడిశెట్టి, ఫోటోగ్రఫీ: బళ్ళారి రఘు, నిర్మాణం: జీనస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, నిర్మాత: రవికుమార్ డి.ఎస్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సురేంద్ర జి.ఎల్.