డేటా చోరీ కేసులో షాకింగ్ నిజాలు చెప్పిన 'సిట్'
Send us your feedback to audioarticles@vaarta.com
'డేటా చోరీ' కేసులో ఇప్పటికే ఏపీలోని దాదాపు అన్ని నియోజకవర్గాల ప్రజల డేటా ఉన్నట్లు సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ తేల్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసును ‘సిట్’కు బదాలాయించిన అనంతరం ఫస్ట్ టైం.. ప్రత్యేక దర్యాప్తు బృందం స్టీఫెన్ రవీంద్ర మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఐటీ గ్రిడ్స్ డేటా చోరీ కేసును సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తామన్నారు. ఐటీ గ్రిడ్స్ సంస్థ తెలంగాణ ప్రజల డేటాను కూడా తీసుకుందని షాకింగ్ నిజం చెప్పారు. ఐటీ గ్రిడ్స్‌తో పాటు మరి కొన్ని సంస్థలు డేటా చోరీకి పాల్పడినట్లు అనుమానాలు ఉన్నాయని ఆయన చెప్పారు. ఐటీ గ్రిడ్స్, బ్లూ ఫ్రాగ్స్ మొబైల్ టెక్నాలజీతో పాటు ఇంకా ఈ కేసులో ఎవరైనా ఉన్నారా అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన డేటా కూడా ఉండటంతో తమకు అనేక అనుమానాలు వచ్చాయని తెలిపారు. సిట్‌లో 9 మంది అధికారులు ఇప్పటికే విచారణ ప్రారంభించారని తెలిపారు.
అమరావతిలో ఉన్నా.. అమెరికాలో ఉన్నా పట్టుకుంటాం..!
ఆయన మాటలతో రాష్ట్ర ప్రజల్లో కలవరం మొదలైంది. ప్రధాన నిందితుడు అమరావతిలో ఉన్నా, అమెరికాలో ఉన్నా కచ్చితంగా పట్టుకుని తీరుతామని.. దోషులు ఎవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. ఈ కేసులో ప్రతి అంశాన్ని క్షుణ్నంగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. డేటా చోరీలో ప్రమేయం ఉన్నవారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సున్నితమైన ఈ డేటా ఆధారంగా ఓట్ల తొలగింపు జరుగుతోందనేది ప్రధాన ఆరోపణ స్టీఫెన్ చెప్పుకొచ్చారు. ప్రజల వ్యక్తిగత సమాచారం ఐటీ గ్రిడ్స్ సంస్థకు ఎలా వచ్చింది?. విశ్వసనీయంగా ఉంచాల్సిన డేటా ప్రైవేట్ సంస్థకు ఎవరిచ్చారు? తెలంగాణ ప్రజల డేటాతో ఏం చేయాలనుకున్నారు? అనే అంశాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. కేసు దర్యాప్తులో మరింత సమాచారం కోసం నిపుణుల సహకారం తీసుకుంటున్నామని చెప్పారు. ఫిర్యాదుల పర్వం ప్రారంభం అనంతరం ‘సేవామిత్ర’లో ఉన్న కొన్ని యాప్స్ తొలగించినట్లు దర్యాప్తులో తేలిందన్నారు.
మూడు బృందాలుగా విడిపోయి..
ఇదిలా ఉంటే.. ఐటీ గ్రిడ్స్ విచారణ కోసం మూడు బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు సిట్ చీఫ్ స్టీఫెన్ రవీంద్ర గురువారం ఉదయమే ఓ ప్రకటనలో తెలిపారు.
డేటాను విశ్లేషించడంతో పాటు డిలీట్ చేసిన డేటాను తిరిగి పొందేందుకు ఓ టీమ్ ను ఏర్పాటు చేశారు.
డేటా గ్రిడ్స్ వ్యవహారంలో సాక్షులు, అనుమానితులను విచారించేందుకు మరో బృందాన్ని నియమించారు.
కేసులో మొత్తం వ్యవహారానికి సూత్రధారిగా అనుమానిస్తున్న ఐటీ గ్రిడ్స్ డైరెక్టర్ అశోక్‌ను పట్టుకోవడానికి మరో టీమ్‌ను ఏర్పాటు చేయడం జరిగింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments