సిసింద్రీకి ఇరవై ఏళ్లు...
Send us your feedback to audioarticles@vaarta.com
నాగార్జున వారసుడు అఖిల్ సిసింద్రీ గా సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.అయితే... అఖిల్ సిసింద్రీగా సంవత్సరం వయసు కూడా లేకండానే తెరపై కనిపించి సెన్సేషన్ క్రియేట్ చేయడం విశేషం. గ్రేట్ ఇండియా ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై నాగార్జున సిసింద్రీ చిత్రాన్ని నిర్మించారు. శివ నాగేశ్వరరావు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో సిసింద్రీ అఖిల్ తో పాటు కింగ్ నాగార్జున కూడా నటించారు. సిసింద్రీగా అటు అభిమానులను, ఇటు ఇండస్ట్రీని ఎంతగానో ఆకట్టుకున్నాడు అఖిల్.
సిసింద్రీ రిలీజ్ అయిన నేటికి అనగా సెప్టెంబర్ 14కి సరిగ్గా 20 ఏళ్లు. అఖిల్...సిసింద్రీగా అలరించిన 20 ఏళ్లుకు హీరోగా అరంగేట్రం చేస్తుండడం విశేషం. నాడు సిసింద్రీ అఖిల్ పై ముహుర్తపు సన్నివేశానికి తాత అక్కినేని క్లాప్ ఇవ్వగా...నేడు అఖిల్ చిత్రానికి అమ్మ అమల క్లాప్ ఇవ్వడం విశేషం. తాత జయంతి రోజున అఖిల్ తొలి చిత్రం అఖిల్ ఆడియో ఆవిష్కరణోత్సవం జరగనుంది. అక్టోబర్ 22న తొలిసారి హీరోగా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు అఖిల్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com