Sirf Ek Bandaa Kaafi Hai: 'సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై' ట్రైలర్: అసామాన్యుడితో సామాన్యుడి పోరాటం

  • IndiaGlitz, [Friday,June 02 2023]

అత‌నొక సామాన్యమైన వ్య‌క్తి.. వృత్తి రీత్యా లాయ‌ర్‌. కొన్ని ప‌రిస్థితుల్లో ఓ అసామాన్య‌మైన వ్య‌క్తితో ఓ కేసు ప‌రంగా పోరాటం చేయాల్సి వ‌స్తుంది. ఆ సామాన్యుడికి తానెలాంటి పోరాటం చేస్తున్నాన‌నే సంగ‌తి తెలుసు. దాని వ‌ల్ల ఎదుర‌య్యే ఇబ్బందులు ఎలా ఉంటాయ‌నేది కూడా బాగా తెలుసు. కానీ ఓ అమ్మాయికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో సంఘంలో పేరు, ప్ర‌తిష్ట‌లున్న‌, అభిమాన గ‌ణం మెండుగా ఉన్న ఓ స్వామీపై పోరాటం చేయ‌టానికి నిశ్చ‌యించుకుంటాడు. మ‌రి ఆ గాడ్ మ్యాన్ మీద ఈ కామ‌న్ మ్యాన్ విజ‌యాన్ని సాధించాడా? అనేది తెలియాలంటే ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’ వెబ్ ఒరిజిన‌ల్ ఫిల్మ్ చూడాల్సిందేనంటున్నారు మేక‌ర్స్‌.

ఉత్త‌రాదితో పాటు ద‌క్షిణాదిన కూడా విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌ల‌తో త‌న‌దైన గుర్తింపు పొందిన న‌టుడు మ‌నోజ్ బాజ్‌పాయి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన వెబ్ ఒరిజిన‌ల్ మూవీ ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్‌తో పాటు భ‌న్సాలి స్టూడియోస్ బ్యాన‌ర్స్‌పై వినోద్ భన్సాలి, క‌మ‌లేష్ భ‌న్సాలి, విశాల్ గుర్నాని, అసిఫ్ షేక్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అపూర్వ సింగ్ క‌ర్కి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. హిందీలో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన ఈ చిత్రం యూనిక్ కాన్సెప్ట్‌తో రూపొందటంతో దీన్ని జూన్ 7న తెలుగు, త‌మిళంలోనూ రిలీజ్ చేస్తున్నారు. అందులో భాగంగా ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’ ట్రైల‌ర్‌ను తెలుగు, త‌మిళ భాష‌ల్లో రిలీజ్ చేశారు.

ట్రైల‌ర్‌ను గ‌మ‌నిస్తే.. నిజ ఘ‌ట‌న‌లు ఆధారంగా ఈ వెబ్ ఫిల్మ్‌ను తెర‌కెక్కించారు. నూసిన్ అనే మైన‌ర్ బాలిక‌తో ఓ స్వామిజీ త‌ప్పుగా ప్ర‌వ‌ర్తిస్తుంది. దీంతో ఆ అమ్మాయికి అండ‌గా లాయ‌ర్ సోలంకి (మ‌నోజ్ బాజ్‌పాయి) నిల‌బ‌డ‌తాడు. అప్ప‌టి వ‌ర‌కు చేసిన పోరాటాల‌కు.. తానిప్పుడు చేయ‌బోయే పోరాటం ఎంతో వైవిధ‌మ్యైనదో తెలిసాని సోలంకి అమ్మాయికి త‌న మ‌ద్ద‌తుని తెలియ‌జేస్తాడు. మ‌రి ఆ కేసులో గెలిచింది ఎవ‌రు? స్వామీజీకి శిక్ష ప‌డిందా? అనేది ఆస‌క్తిక‌రంగా, ఎంగేజింగ్‌గా ఉంది. సినిమా చూడాల‌నే ఎగ్జ‌యిట్మెంట్ మ‌రింత పెంచుతుంది.

సోసైటీ కొంద‌రు మంచి అనే ముసుగు వేసుకుని చెడు ప‌నులు చేస్తుంటారు. అలాంటి ఓ బాబా ఓ మైన‌ర్ బాలికను ఇబ్బంది పెడ‌తాడు. ఆ అమ్మాయి ధైర్యంగా ఆయ‌న‌పై ఫిర్యాదు చేస్తుంది. అయితే స‌ద‌రు బాబా అనుంగ భ‌క్తులు ఆ అమ్మాయిపై ఎదురు దాడికి దిగుతారు. అప్పుడు ఓ లాయ‌ర్ ఆ అమ్మాయి త‌ర‌పున నిల‌బ‌డి ఎలాంటి న్యాయం చేశాడ‌నే నిజ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు. అంద‌రిలో సోష‌ల్ అవేర్‌నెస్‌ను క‌లిగించే చిత్ర‌మిది.

పి.సి.సోలంకి పాత్ర‌లోమ‌నోజ్ బాజ్‌పాయ్‌, నూసిన్‌గా అడ్రిజ, స్వామిజీగా సూర్య మోహ‌న్‌, అమిత్ నిహాగ్‌గా నిఖిల్‌ పాండే, చంచ‌ల్ మిశ్రాగా ప్రియాంక సేథియ‌, నూసిల్ తండ్రి పాత్ర‌లో జైహింద్ కుమార్‌, నూసిల్ త‌ల్లి పాత్ర‌లో దుర్గా శ‌ర్మ త‌దిత‌రులు నటించారు.

More News

Pawan Kalyan Vaarahi: ఆ రోజు నుండి రోడ్డెక్కనున్న పవన్ వారాహి...

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్ర వ్యాప్త ఎన్నికల ప్రచారం కోసం ప్రత్యేకంగా రూపొందించిన వాహనం వారాహి. ఈ నెల 14 నుంచి పవన్ వారాహి ద్వారా జనాల్లోకి వెళ్లనున్నారు.

క్యాంటీన్‌లో మిత్రులను ఆటపట్టిస్తూ.. కొండ కోనలను ఎక్కేస్తూ.. కాలేజీ రోజుల్లో కేటీఆర్ ఇలా

కల్వకుంట్ల తారక రామారావు.. షార్ట్ కట్‌లో కేటీఆర్ . ఈయన గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియనివారుండరు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తగిన వారసుడిగా ఆయన రాజకీయాల్లో దూసుకెళ్తున్నారు.

ఆ కల నిజం చేసుకుంటున్నాం.. తెలంగాణ బ్రదర్స్ అండ్ సిస్టర్స్‌కు శుభాకాంక్షలు: రామ్ చరణ్

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఎందరో పోరాట యోధుల త్యాగ ఫలం.. తెలంగాణ కీర్తి అజరామరం : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

Bholaa Shankar: 'భోళా శంకర్' - భోళా మానియా ఫస్ట్ లిరికల్ జూన్ 4న

వాల్తేరు వీరయ్య విజయంతో దూసుకుపోతున్న మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగా మాసివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్