అంరంగ వైభవంగా సింగర్ సునీత వివాహం..
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ గాయని సునీత వివాహం మ్యాంగో వీడియోస్ అధినేత రామ్ వీరపనేనితో అంగరంగ వైభవంగా జరిగింది. శంషాబాద్ సమీపంలోని అమ్మపల్లిలోని శ్రీ సీతారామ చంద్రస్వామి ఆలయం వీరి వివాహానికి వేదికగా మారింది. అతికొద్ది మంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో సునీత, రామ్ వీరపనేనిల వివాహం జరిగింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై నూతన జంటను ఆశీర్వదించారు. ప్రస్తుతం సునీత వివాహానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సింగర్ సునీత వివాహానికి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఈ వివాహ వేడుకకు హాజరైన ఈ మధ్యే పెళ్లి చేసుకున్న హీరో నితిన్ - శాలినిలను కూడా మంత్రి ఎర్రబెల్లి ఆశీర్వదించి.. శుభాకాంక్షలు తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout