వాయిదా పడిన సింగర్ సునీత వివాహం..

  • IndiaGlitz, [Wednesday,December 16 2020]

ప్రముఖ సింగర్ సునీత మరోసారి వివాహానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. మొదటి భర్తతో విడాకులు తీసుకున్న సునీత.. డిజిటల్ మీడియా సంస్థ అధినేత రామ్‌ వీరపనేనితో రెండో వివాహానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే వీరివురి నిశ్చితార్థం ఇటీవల జరిగింది. నిశ్చితార్థపు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఆమెను అభిమానించే వారంతా సంతోషం వ్యక్తం చేశారు. డిసెంబర్ 27న వీరిద్దరి వివాహం జరగనుందని ఇటీవల వార్తలు కూడా వచ్చాయి.

అయితే.. తాజాగా వీరి వివాహం వాయిదా పడినట్లుగా వార్తలు వినవస్తున్నాయి. కొన్ని కారణాల వల్ల సునీత, రామ్‌ల వివాహం వాయిదా పడిందని తెలుస్తోంది. అయితే వాయిదా పడటానికి కారణాలు తెలియరాలేదు. అయితే త్వరలోనే మంచి ముహూర్తం చూస్తారని మాత్రం తెలుస్తోంది. నూతన సంవత్సరంలో మంచి ముహూర్తం ఫిక్స్ చేసి సునీత, రామ్‌ల వివాహం జరిపించాలని ఇరు వైపుల కుటుంబ సభ్యులు నిర్ణయించినట్టు తెలుస్తోంది.

More News

చేపల వేటకు వెళ్లిన వారికి షాక్... బీచ్‌లో కొట్టుకొచ్చిన బంగారం

చేపల వేటే వారికి జీవనాధారం.. వాటిని పట్టుకుని అమ్మితేనే రోజు గడుస్తుంది. ఎప్పటిలాగే మత్స్యకారులంతా ఆ రోజు కూడా చేపల వేటకు వెళ్లారు.

భర్తతో కలిసి ‘ఆచార్య’ సెట్స్‌కి కాజల్.. బొకేతో మెగాస్టార్ స్వాగతం

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ఆచార్య. వీరిద్దరి కాంబోలో సినిమా అనగానే అంచనాలు ఆకాశాన్నంటాయి.

బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలేకు 3 ముద్దుగుమ్మలు.. లక్షల్లో రెమ్యునరేషన్..

పెద్దగా అంచనాలేమీ లేకుండా స్టార్ట్ అయినప్పటికీ.. ఇప్పుడు మంచి రేటింగ్స్‌తో బిగ్‌బాస్ రియాలిటీ షో దూసుకుపోతోంది.

‘స‌లార్’లో మ‌రో స్టార్ హీరో.. ఆడిష‌న్స్ షురూ అయ్యాయి

ప్ర‌భాస్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో హోంబ‌లే ఫిలింస్ బ్యాన‌ర్‌లో విజ‌య్ క‌ర‌గందూర్ ‘సలార్’ అనే ప్యాన్ ఇండియా మూవీని నిర్మించనున్న సంగతి తెలిసిందే.

రజినీకాంత్ పార్టీ పేరు, గుర్తు ఖ‌రారు

త‌లైవా.. సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ డిసెంబ‌ర్ 31న త‌న రాజ‌కీయ పార్టీ పేరుని అనౌన్స్ చేసి జ‌న‌వ‌రిలో పార్టీని ప్రారంభిస్తాన‌ని ఇప్ప‌టికే అనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే.