సింగర్ సునీత పెళ్లి డేట్ ఫిక్స్.. నేడు ప్రి వెడ్డింగ్ పార్టీ..
- IndiaGlitz, [Saturday,December 26 2020]
టాలీవుడ్ ప్రముఖ సింగర్ సునీత పెళ్లి డేట్ ఫిక్స్ అయిపోయింది. సునీత మొదటి భర్త నుంచి విడాకులు తీసుకుని ప్రముఖ డిజిటల్ మీడియా అధినేత రామ్ వీరపనేనితో రెండో పెళ్లికి సిద్ధమైన విషయం తెలిసిందే. కొన్నిరోజుల ముందే హైదరాబాద్లో కుటుంబ సభ్యుల, సన్నిహితుల సమక్షంలో రామ్, సునీతల నిశ్చితార్థం జరిగింది. ఇటీవలే సింగర్స్ యూనిట్కి గ్రాండ్ పార్టీ ఇచ్చిన ఈ జంట.. తమ పెళ్లి డేట్ ఫిక్స్ అవడంతో శనివారం సినీ పరిశ్రమలోని ఇతర సెలబ్రిటీలకు ప్రీ వెడ్డింగ్ పార్టీ ఇవ్వనున్నారు.
రామ్, సునీతల పేర్లతో ఓ ప్రీ వెడ్డింగ్ కార్డ్ కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. డిసెంబర్ 26 సాయంత్రం గచ్చిబౌలిలోని బౌల్డర్ హిల్స్.. రామ్, సునీత ప్రీ వెడ్డింగ్ పార్టీకి వేదిక కానుంది. కాగా.. వీరి వివాహం జనవరి 9వ తేదీన జరగనుంది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ వివాహం జరగబోతోంది. నిజానికి రామ్, సునీతల వివాహం డిసెంబర్లోనే జరగాల్సి ఉంది కానీ వాయిదా పడినట్టు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో మరికొన్ని నెలలు టైం పడుతుందని సునీత అభిమానులు భావించారు కానీ జనవరి 9నే వీరి వివాహం ఫిక్స్ అయిపోయింది.