ఫ్యాన్స్‌కి క్షమాపణలు చెప్పిన సింగర్ సునీత
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్లో సింగర్ సునీతకు అభిమాన గణం ఎక్కువే. టీవీ యాంకర్‌గా, సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్నారు. ఆమె కట్టు, బొట్టు సైతం చాలా సంప్రదాయబద్దంగా ఉండటంతో ఆమెను అంతా చాలా అభిమానిస్తారు. దీంతో సునీతకు ఇతర సింగర్స్‌తో పోలిస్తే అభిమానులు చాలా ఎక్కువ. ఇక ఇటీవల రామ్ నరపనేనిని రెండో వివాహం చేసుకున్న సునీత ఇటు కెరీర్‌ను, అటు వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నారు. తాజాగా సింగర్ సునీత అభిమానుల మనసును నొప్పించినందుకు సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పారు.
అసలు విషయంలోకి వెళితే... ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లోని పీపుల్స్ ప్లాజాలో‘మణిశర్మ మ్యూజికల్ నైట్’ ఈవెంట్ జరగాల్సి ఉంది. ఈ కార్యక్రమంలో సునీతతో పాటు గీతామాధురి, రేవంత్, రమ్య బెహ్రా, శ్రీకృష్ణ, అనురాగ్ కులకర్ణి, సాకేత్, సాహితి తదితర గాయకులు పాల్గొనాల్సి ఉంది. అయితే హైదరాబాద్‌లో కరోనా కేసులో ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఈ కార్యక్రమం రద్దయింది. ఈ విషయాన్ని సింగర్ సునీత సోషల్ మీడియాలో తెలియజేస్తూ.. ఫ్యాన్స్‌కి క్షమాపణ చెప్పింది.
‘‘కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇవాళ జరగాల్సిన మణిశర్మ మెగా మ్యూజికల్ ఈవెంట్ క్యాన్సిల్ అయ్యిందని వెల్లడిస్తున్నందుకు క్షమించండి. అందరి క్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే దీన్ని క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. మీరు అందిస్తున్న సహకారానికి థన్యవాదాలు. స్టే సేఫ్ అండ్ స్టే హెల్దీ’ అంటూ శనివారం తన ఫేస్బుక్ అకౌంట్లో సునీత పోస్ట్ పెట్టారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments