Singer Sunitha: ప్రెగ్నెన్సీ వార్తలపై స్పందించిన సింగర్ సునీత .. ఇక పుకార్లకు చెక్ పడినట్లేనా..?
Send us your feedback to audioarticles@vaarta.com
పెళ్లీడుకొచ్చిన ఇద్దరు పిల్లలను పెట్టుకుని మిడిల్ ఏజ్‌లో సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారంటూ సింగర్ సునీతపై కొందరు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు. కానీ ఇవేవీ పట్టించుకోని ఆమె... కొత్త జీవితాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే తన మిత్రుడు, మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేనిని జనవరి 9 2021 నాడు పెళ్లాడారు. ప్రస్తుతం ఈ జంట కొత్త జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇదిలావుండగా.. సునీత్ గర్భం దాల్చారంటూ మొన్నామధ్య వార్తలు గుప్పుమన్నాయి. దీనికి తోడు సోషల్ మీడియాలో మామిడి చెట్టు కింద నిలబడి సునీత ఫోజులు ఇవ్వడంతో దీనికి మరింత బలం చేకూరినట్లయ్యింది. కానీ దీనిపై రామ్ కానీ, సునీత కానీ స్పందించలేదు.
ఇళయరాజా మ్యాజిక్ కాన్సర్ట్‌లో పాల్గొననున్న సునీత:
అయితే ఎట్టకేలకు సునీత మౌనం వీడారు. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా త్వరలో ఓ కాన్సర్ట్ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాల్లో సునీత చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే మీడియా ప్రతినిధులు ప్రెగ్నెన్సీ వార్తలపై ఆమెను ప్రశ్నించారు. దీనికి సునీత స్పందిస్తూ.. ఈ విషయం తనకు కూడా తెలియదని, ఈ పుకార్లు వైరల్ చేస్తున్న ఆలోచనా విధానానికే దీనిని వదిలేస్తున్నానంటూ గట్టి కౌంటరిచ్చారు.
హీరోగా ఎంట్రీ ఇస్తున్న సునీత కొడుకు :
ఇకపోతే.. సునీత కుమారుడు ఆకాశ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కుమార్తె శ్రియాను సింగర్‌గా పరిచయం చేసిన ఆమె.. కుమారుడి జీవితాన్ని కూడా సెట్ చేసే పనిలో పడ్డారు. ఆకాశ్ పుట్టినరోజును పురస్కరించుకుని కుమారుడి సిల్వర్ స్క్రీన్ ఎంట్రీని కన్ఫర్మ్ చేశారు సునీత. ‘‘సర్కారు నౌకరి’’ పేరుతో తెరకెక్కించనున్న ఈ సినిమాకు గంగనమోని శేఖర్ దర్శకత్వం వహించనున్నారు. ఆర్ కే టెలీ షో ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు నిర్మిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com