సింపుల్గా సింగర్ సునీత ఎంగేజ్మెంట్...
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ గాయని సునీత(42) వివాహంపై ఈ మధ్య విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే దీనిపై ఆమె స్పందించకపోవడంతో అసలు ఆ వార్త నిజమా.. లేదంటే పుకారా? అన్న సందిగ్ధంలో అభిమానులు ఉండిపోయారు. అయితే ఈ అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తూ సోమవారం సునీత ఎంగేజ్మెంట్ ఫోటోలు బయటకు వచ్చాయి. డిజిటల్ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న బిజినెస్ మెన్ రామ్ వీరపనేనితో సోమవారం ఉదయం సునీత నిశ్చితార్థం జరిగింది. అతికొద్ది మంది సమక్షంలో ఇంట్లోనే సింపుల్గా నిశ్చితార్థ కార్యక్రమాన్ని నిర్వహించారు.
కాగా.. 19 ఏళ్ల వయసులోనే సునీతకు వివాహమైన సంగతి తెలిసిందే. ఇద్దరు పిల్లలు పుట్టాక.. భర్త తీరుతో విసిగిపోయిన సునీత విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి పిల్లల సంరక్షణ బాధ్యతలు చూసుకుంటూ ఒంటరిగానే ఉండిపోయారు. అయితే గతంలో తనకు రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశ్యమే లేదని సునీత ఓ సందర్భంలో చెప్పారు. ఇలా అనూహ్యంగా పెళ్లి వార్తలు బయటకు రావడంతో పాటు నేడు వాటిని నిజం చేస్తూ ఆమె ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. ఆ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
దీనిపై సింగర్ సునీత ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘‘ప్రతి తల్లిలాగే నేను కూడా నా పిల్లల ఉన్నతి కోసం కలలు కన్నాను. అదే సమయంలో నేను జీవితంలో స్థిరపడాలనుకునే మంచి ఆలోచన ఉన్న పిలలతో నేను ఆశీర్వదించబడ్డాను. మంచి ఫ్రెండ్, వండర్ఫుల్ పార్ట్నర్ అయిన రామ్ నా జీవితంలోకి ఎంటర్ అయ్యారు. త్వరలోనే మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. నేను నా జీవితాన్ని ప్రైవేటుగా ఉంచాలనుకుంటున్నా. నన్ను అర్ధం చేసుకున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’’ అని సునీత ట్వీట్ చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com