Singer Revanth : తండ్రైన సింగర్ రేవంత్... పండంటి బిడ్డకు జన్మనిచ్చిన అన్విత , ఫ్యాన్స్ సంబరాలు
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ 6 తెలుగులో స్ట్రాంగ్ కంటెస్టెంట్, విన్నర్ మెటీరియల్ ఎవరంటే ఠక్కున చెప్పే పేరు రేవంత్ అనే. మనోడికి కొంచెం దూకుడు ఎక్కువగాని, మంచి మనసుంది. చిన్న విషయానికి కూడా కోప్పడే మనస్తత్వమే అప్పుడప్పుడు ఆయనకు శాపంలా మారుతూ వుంటుంది. సింగర్‌గా సత్తా చాటుతోన్న రేవంత్.. ఆ పాపులారిటీతోనే బిగ్‌బాస్ 6 తెలుగులో ప్లేస్ సంపాదించాడు.
సీమంతానికి కూడా వెళ్లలేకపోయిన రేవంత్:
ఇకపోతే.. బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లేముందే రేవంత్ తన భార్య అన్విత నిండు గర్బిణి అని , ఆమెను వదిలి రావడం తనకు ఇష్టం లేదని చెప్పాడు. అంతేకాదు.. భార్య సీమంతానికి పక్కన లేకపోవడంతో చాలా బాధపడ్డాడు. అయితే ఇంటిలో ఆ వీడియోను ప్లే చేసి రేవంత్‌ను సర్‌ప్రైజ్ చేశాడు బిగ్‌బాస్. ఈ వీడియో చూస్తూ చాలా ఎమోషనల్ అయ్యాడు రేవంత్. మొన్నామధ్య భార్యతో వీడియో కాల్ మాట్లాడి సంబరపడిపోయాడు. బిడ్డ పుట్టే సమయానికి తాను నీ పక్కనే వుంటానని చెప్పాడు.
రేవంత్ ఫ్యాన్స్ సంబరాలు:
ఈ నేపథ్యంలో రేవంత్ సతీమణి అన్విత శుభవార్త చెప్పారు. తాను పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు. దీంతో రేవంత్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ మేరకు వారిద్దరికి కంగ్రాట్స్ చెబుతూ.. బిడ్డను దీవిస్తున్నారు. అంతేనా రేవంత్ బిగ్‌బాస్ టైటిల్ గెలిచినంత హడావుడి చేస్తున్నారు. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో అన్విత డెలివరీ జరిగినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం తల్లీ, బిడ్డా క్షేమంగా వున్నారని సమాచారం.
ఈ ఏడాది ఫిబ్రవరిలో అన్వితతో రేవంత్ వివాహం:
ఇకపోతే.. ఇండియన్ ఐడల్‌గా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రేవంత్.. తర్వాత ప్లే బ్యాక్ సింగర్‌గా రాణిస్తున్నాడు. గతేడాది డిసెంబర్ 24న గుంటూరు నగరానికి చెందిన అన్విత గంగరాజుతో అతనికి ఎంగేజ్‌మెంట్ జరిగింది. అనంతరం ఈ ఏడాది ఫిబ్రవరి 6న ఆమెను వివాహం చేసుకున్నాడు. కోవిడ్ నేపథ్యంలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం నిరాడంబరంగా జరిగింది. పెళ్లి తర్వాత కూడా వీరిద్దరూ తమ తమ రంగాల్లో రాణిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments