Bigg boss 6 Telugu : బిగ్‌బాస్ 6 విజేత రేవంత్.. రూ.40 లక్షలతో జాక్‌పాట్ కొట్టిన శ్రీహాన్
Send us your feedback to audioarticles@vaarta.com
అందరూ అనుకున్నదే జరిగింది. బిగ్‌బాస్ 6 తెలుగు విజేతగా సింగర్ రేవంత్ నిలిచారు. ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలేలో నలుగురు కంటెస్టెంట్స్‌ని ఓడించి రేవంత్ విజేతగా నిలిచారు. ఫైనల్‌లో ముందుగా రోహిత్, ఆ తర్వాత ఆదిరెడ్డి, కీర్తిలు ఎలమినేట్ అవ్వగా.. చివరికి శ్రీహాన్, రేవంత్ మధ్య పోటీపడింది. వీరిద్దరిలో విజేత ఎవరు అనే ఉత్కంఠ నెలకొంది. హోస్ట్ నాగార్జున సైతం ఊరించే ప్రైజ్ మనీతో ఎరవేశారు. రూ.25 లక్షల నుంచి స్టార్ట్ చేసి.. దానిని 30 లక్షలకు తీసుకెళ్లారు.
తండ్రి మాట మేరకు రూ.40 లక్షలకు ఓకే చెప్పిన శ్రీహాన్ :
అయినప్పటికీ ఇద్దరూ తగ్గకపోవడంతో ప్రేక్షకుల్లో ఉత్కంఠ పెరిగింది. చివరికి మాజీ కంటెస్టెంట్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఆఫర్ తీసుకుని సైడ్ అవ్వాలని సలహా ఇచ్చారు. దీంతో ఆలోచనలో పడ్డ శ్రీహాన్.. చివరికి తండ్రి మాట మేరకు రూ.40 లక్షలకు ఓకే చెప్పారు. ఆ వెంటనే బిగ్‌బాస్ 6 తెలుగు విజేతగా రేవంత్ నిలిచినట్లు నాగార్జున ప్రకటించారు. విన్నర్ అయిన వెంటనే రేవంత్ గాల్లో తేలాడు. చెప్పినట్లుగా టైటిల్‌తోనే వస్తానన్న మాటను ఆయన నిజం చేసి చూపాడు.
రేవంతే విన్నర్ అని ఫిక్స్ అయిన జనాలు:
బిగ్‌బాస్ 6 తెలుగులో స్ట్రాంగ్ కంటెస్టెంట్, విన్నర్ మెటీరియల్ ఎవరంటే ఠక్కున చెప్పే పేరు రేవంత్ అనే. తొలి నుంచి బిగ్‌బాస్ అభిమానులు.. రేవంతే విన్నర్ అవుతాడని ఫిక్స్ అయిపోయారు. మనోడికి కొంచెం దూకుడు ఎక్కువగాని, మంచి మనసుంది. చిన్న విషయానికి కూడా కోప్పడే మనస్తత్వమే అప్పుడప్పుడు ఆయనకు శాపంలా మారుతూ వుంటుంది. సింగర్‌గా సత్తా చాటుతోన్న రేవంత్.. ఆ పాపులారిటీతోనే బిగ్‌బాస్ 6 తెలుగులో ప్లేస్ సంపాదించాడు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో అన్వితతో రేవంత్ వివాహం:
ఇండియన్ ఐడల్‌గా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రేవంత్.. తర్వాత ప్లే బ్యాక్ సింగర్‌గా రాణిస్తున్నాడు. గతేడాది డిసెంబర్ 24న గుంటూరు నగరానికి చెందిన అన్విత గంగరాజుతో అతనికి ఎంగేజ్‌మెంట్ జరిగింది. అనంతరం ఈ ఏడాది ఫిబ్రవరి 6న ఆమెను వివాహం చేసుకున్నాడు. కోవిడ్ నేపథ్యంలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం నిరాడంబరంగా జరిగింది. పెళ్లి తర్వాత కూడా వీరిద్దరూ తమ తమ రంగాల్లో రాణిస్తున్నారు.
సీమంతానికి కూడా వెళ్లలేకపోయిన రేవంత్:
బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లేముందే రేవంత్ తన భార్య అన్విత నిండు గర్బిణి అని , ఆమెను వదిలి రావడం తనకు ఇష్టం లేదని చెప్పాడు. అంతేకాదు.. భార్య సీమంతానికి పక్కన లేకపోవడంతో చాలా బాధపడ్డాడు. అయితే ఇంటిలో ఆ వీడియోను ప్లే చేసి రేవంత్‌ను సర్‌ప్రైజ్ చేశాడు బిగ్‌బాస్. ఈ వీడియో చూస్తూ చాలా ఎమోషనల్ అయ్యాడు రేవంత్. మొన్నామధ్య భార్యతో వీడియో కాల్ మాట్లాడి సంబరపడిపోయాడు. బిడ్డ పుట్టే సమయానికి తాను నీ పక్కనే వుంటానని చెప్పాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments