కరోనాను జయించిన కనికా.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి బారి నుంచి బాలీవుడ్ ప్రముఖ గాయని కనికాకపూర్ ఎట్టకేలకు కోలుకుంది. గత 14 రోజులకుపైగా కరోనాపై పోరాడిన ఆమె ఎట్టకేలకు విజయం సాధించింది. వరుసగా నాలుగుసార్లు టెస్ట్‌లు చేసినప్పటికీ ఆమెకు నెగిటివ్ రావడంతో అసలేం జరుగుతోందో అర్థం కానిపరిస్థితి. దీంతో కుటుంబ సభ్యులు, మిత్రులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే ఐదోసారి టెస్ట్ చేయగా నెగిటివ్ రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా సోమవారం నాడు మరోసారి టెస్ట్ చేయగా నెగిటివ్ వచ్చింది. దీంతో కనికా కోలుకున్నట్లేనని వైద్యులు చెబుతున్నారు.
కాగా.. ఇవాళ లక్నోలోని సంజయ్ గాంధీ పోస్టు గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆస్పత్రి నుంచి కనికా డిశ్చార్జ్ అయ్యింది. లండన్‌లో పర్యటించి వచ్చిన తర్వాత ఆమెకు కరోనా లక్షణాలుండటంతో ఆస్పత్రికి తరలించి టెస్ట్ చేయగా.. మార్చి 20న పాజిటివ్ అని తేలింది. నాటి నుంచి ఆస్పత్రిలో ప్రత్యేకంగా చికిత్స తీసుకున్న ఆమె తాజాగా డిశ్చార్జ్ అయ్యింది. డిశ్చార్జ్ అయినప్పటికీ 14 రోజుల పాటు క్వారంటైన్‌లోనే ఉండాలని వైద్యులు సూచించారు. మరోవైపు క్వారంటైన్‌లో ఉండకుండా బయటతిరిగితే మాత్రం కఠిన చర్యలు తప్పవని పోలీసు అధికారులు కనికాను హెచ్చరించినట్లు తెలుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments