Bigg Boss 7 Telugu : దామిని ఎలిమినేషన్.. వెళ్తూ వెళ్తూ శివాజీతో గొడవ, బిగ్‌బాస్ స్టేజ్‌పై రామ్ సందడి
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ తెలుగు 7 మూడో వారాన్ని కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఆదివారం అంటేనే ఎలిమినేషన్ రౌండ్ కదా. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయ్యారో చూస్తే. శనివారం నాటి ఎపిసోడ్లో ప్రిన్స్ యావర్ సేవ్ అయ్యాడు. ఆదివారం మిగిలిన వారిని సేవ్ చేసే పనిని ప్రారంభించారు నాగ్. అలాగే చిట్టి ప్రశ్నలు అనే గేమ్ పెట్టి ఫన్ రాబట్టే ప్రయత్నం చేశారు. దీనిలో భాగంగా కలర్స్ ఉన్న ఓ చక్రం వుంటుంది. దానిపై బాణం గుర్తు ఏ రంగుపై ఆగుతుందో.. నాగార్జున ఆ చీటి తీస్తాడు. అందులో వున్న ప్రశ్నకు ఎవరైతే సూట్ అవుతారో వారు పేరు చెప్పాల్సి వుంటుంది. హౌస్‌లో ప్రశాంత్ కన్నింగ్ అని శోభాశెట్టి చెప్పింది. అలాగే ఇంట్లో కపట నాటక సూత్రధారి ఎవరు అంటే శివాజీ అని చెప్పాడు అమర్దీప్. హౌస్‌లో నమ్మకూడని వ్యక్తి తేజ అని గౌతమ్ చెప్పాడు. అలాగే టేస్టీ తేజ ఇంట్లో కలుపు మొక్క అని శివాజీ వ్యాఖ్యానించారు. ఇంట్లో తేనే పూసిన కత్తి సందీప్ మాస్టర్ అని దామిని చెప్పింది.
అనంతరం స్కంధ టీమ్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. హీరో రామ్ వచ్చి కంటెస్టెంట్స్‌కి గేమ్ పెట్టాడు. దీనిలో భాగంగా మ్యూజిక్ ప్లే అవుతుంది. దీనిని బట్టి పాటను గెస్ చేయాలి. ఇంటి సభ్యులను టీమ్ స్కంద, టీమ్ ఇస్మార్ట్ అని రెండు గ్రూపులుగా విభజించారు. ఈ టాస్క్‌లో టీమ్ స్కంధ (అమర్దీప్ , శివాజీ, తేజ, గౌతమ్, శోభాశెట్టి, దామిని) గెలిచింది. తర్వాత నామినేషన్స్‌లో వున్న వారిని సేవ్ చేసే ప్రక్రియను ప్రారంభించారు నాగ్.
అమర్దీప్, ప్రియాంక, గౌతమ్, దామిని, శుభశ్రీ, రతిక నామినేషన్స్‌లో వున్నవారు. చివరిలో శుభశ్రీ, దామిని ఇద్దరే మిగిలారు. ఈ క్రమంలో ఇద్దరి ఫోటోలు వున్న షిప్ బొమ్మల్లో ఎవరి బొమ్మ పేలిపోతే వారు ఎలిమినేట్ అయినట్లు. అలా నాగ్ కౌంట్‌డౌన్ ఆపగానే దామిని షిప్ బొమ్మ పేలింది. దీంతో దామిని ఎలిమినేట్ అయినట్లుగా నాగార్జున ప్రకటించారు. ఆమె హౌస్‌ను వదిలి వెళ్లిపోతుందని తెలియగానే ప్రియాంక కంటతడి పెట్టింది. మిగిలిన ఇంటి సభ్యులు కూడా దామినికి వీడ్కోలు పలికారు.
తర్వాత బిగ్‌బాస్ స్టేజ్‌పై దామినికి ఓ టాస్క్ ఇచ్చారు నాగార్జున. అక్కడ హౌస్మేట్స్ బెలూన్స్ వుంచారు. దామిని ఒక్కొక్క బెలూన్ పగులగొడుతూ వారికి సలహాలు ఇచ్చింది. ఈ సమయంలోనే శివాజీతో చిన్న వాదన జరిగింది. తాను సేఫ్ గేమ్ ఆడుతున్నట్లుగా గతంలో శివాజీ చెప్పిన విషయాన్ని దామిని ప్రస్తావించింది. దీనికి శివాజీ సైతం ఘాటుగా బదులిచ్చారు. నువ్వు ఫస్ట్ వీక్ మాత్రమే సేఫ్ గేమ్ ఆడావని.. ఆ తర్వాత నీ గేమ్ నువ్వు ఆడలేదని ఘాటుగా బదులిచ్చారు. అనంతరం బిగ్‌బాస్‌పై తాను రాసిన పాటను పాడి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చింది దామిని.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments