మీ టూ ఉద్య‌మంలో సింగ‌ర్ చిన్మ‌యి..

  • IndiaGlitz, [Monday,October 08 2018]

హాలీవుడ్ నుండి బాలీవుడ్‌కి వ‌చ్చిన మీ టూ ఉద్య‌మంలో ప‌లువురు మ‌హిళ‌లు త‌మ ఇబ్బందిప‌డ్డ ఘ‌ట‌న‌ల‌ను తెలియ‌చేస్తున్నారు. నానా ప‌టేక‌ర్ త‌న‌ను లైంగికంగా వేధించాడ‌ని చెప్పినప్ప‌టి నుండి కాస్టింగ్ కౌచ్ బాలీవుడ్‌లో ప్ర‌కంపన‌లు రేపుతున్నాయి. కంగనా ర‌నౌత్ కూడా ద‌ర్శకుడు వికాస్ బాలిపై ఆరోప‌ణలు చేశారు. కాగా ఇప్పుడు సింగ‌ర్ చిన్మ‌యి త‌న‌కు ఎదురైన ప‌రిస్థితుల‌ను మీ టూ ఉద్య‌మంలో వివ‌రించారు.

''అమ్మ త‌న డాక్యుమెంట‌రీ సూప‌ర్ విజ‌న్‌తో బిజీగా ఉండ‌గా.. నేను ప‌క్క గ‌దిలో నిద్ర‌పోతుంటే ఓ వ్య‌క్తి నా ప్రైవేట్ పార్ట్‌ని ట‌చ్ చేసి రాక్ష‌స ఆనందం పొందాడు. ఆ అంకుల్ చెడ్డ‌వాడు అని మా అమ్మ‌కు చెప్పాను'' అంటూ చెప్పిన చిన్మ‌యి ''టీనేజ్ స‌మ‌యంలో అబ్బాయిలు ఏదో వెతికే ఉద్దేశంతో త‌న జేబులో చేయి పెట్టేవార‌ని.. అయితే త‌న చెస్ట్‌ని తాక‌డానిక‌ని త‌ర్వాత అర్థ‌మైంది.. అలాగే పందొమ్మిదేళ్ల వ‌య‌సులో ముస‌లాయ‌న‌ను క‌లిసిన‌ప్పుడు అత‌ను న‌న్ను కౌగిలించుకుని త‌న బుద్ధిని చూపించుకున్నాడు. కొంత‌మంది యువ‌కుల ఈవ్ టీజింగ్ వ‌ల్లే నా ఫ‌స్ట్ బైక్ యాక్సిడెంట్ అయ్యింది. మ‌హిళలు ఇలా ప్ర‌తిరోజూ ఏదో ఒక రీతిలో లైంగిక వేధింపుల‌కు గుర‌వుతూనే ఉన్నారు'' అంటూ చెప్పుకొచ్చారు.