సింగం 3 రిలీజ్ డేట్..!
Tuesday, January 24, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళ హీరో సూర్య నటించిన తాజా చిత్రం సింగం 3. ఈ చిత్రాన్ని హరి తెరకెక్కించారు. సూర్య సరసన అనుష్క, శృతిహాసన్ నటించారు. ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ని స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా నిర్మించారు. తెలుగులో ఈ చిత్రాన్ని నిర్మాత శివ కుమార్ అందిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రావాలి కానీ..కుదరలేదు. ఆతర్వాత ఈనెల 26న రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజ్ చేయాలి అనుకున్నారు.
అయితే తమిళనాడులో జల్లికట్టు కోసం యువత చేస్తున్న నిరసనలతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడం వలన సింగం 3 రిలీజ్ వాయిదా వేసారు. ఇక ఈ మూవీ రిలీజ్ గురించి లేటెస్ట్ అప్ డేట్ ఏమిటంటే...ఫిబ్రవరి 3న సింగం 3 రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈసారి ఎలాంటి అడ్డంకులు రాకుండా సింగం 3 ప్రేక్షకులు ముందుకు వస్తుందని ఆశిద్దాం..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments