సింగం వెనకడుగు వేస్తుందా...?
Send us your feedback to audioarticles@vaarta.com
సూర్య, హరి కాంబినేషన్‌లో వస్తోన్న సూపర్‌హిట్ సీక్వెల్ `ఎస్-3`(సింగం 3). గతంలో ఈ సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌లో వచ్చిన రెండు పార్టులు బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. ఈ మూడో పార్టుల్లో అనుష్క హీరోయిన్‌గా నటిస్తుంటే మూడో పార్టులో శృతిహాసన్ కూడా నటించింది.
ఈ సినిమా డిసెంబర్ 23న థియేటర్స్‌లోకి రానుంది. అయితే నిజానికి ఈ సినిమాను డిసెంబర్ 16న విడుదల చేద్దామనుకున్నారు. కానీ దృవ కారణంగా ఓ వారం వాయిదా పడి డిసెంబర్ 23న రిలీజ్‌కు సిద్ధమైంది. అయితే తాజాగా చెన్నై, పరిసర ప్రాంతాల్లో తుఫాన్ కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో రెండు, మూడు రోజులు ఇదే పరిస్థితులు కొనసాగే అవకాశాలు కనపడుతున్నాయి. దీంతో సింగం3 యూనిట్ డిసెంబర్ 23న రావాలా..వద్దా అనే మీమాంసలో పడింది. ఇండస్ట్రీ వర్గాలైతే సింగం3 మరో వారం వాయిదా పడే అవకాశాలే కనపడుతున్నాయని అంటున్నారు. మరి అధికారక సమాచారం ఏమని వస్తుందో చూడాల్సిందే...
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com