సింగం తెలుగు షోలు ఆగాయి...

  • IndiaGlitz, [Thursday,February 09 2017]

సూర్య‌, అనుష్క‌, శృతిహాస‌న్‌లు హీరో హీరోయిన్లుగా తమిళంలో స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్‌రాజా నిర్మించిన ఈ చిత్రం 'సింగం3'. ఈ సినిమాను తెలుగులో సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై బేబి త్రిష సమర్పణలో మల్కాపురం శివకుమార్ తెలుగులో విడుద‌ల చేస్తున్నారు. నిజానికి ఈరోజు అంటే ఫిబ్ర‌వ‌రి 9 సినిమా రిలీజ్ కావాల్సింది.

కానీ ఈరోజు షోలు తెలుగు రాష్ట్రాల్లో క్యాన్సిల్ అయ్యాయి. సాంకేతిక కార‌ణాల‌నీ అంటున్నారు కానీ డిస్ట్రిబ్యూట‌ర్స్ నిర్మాత‌కు డ‌బ్బులు చెల్లించ‌కపోవ‌డంతో నిర్మాత, త‌మిళ నిర్మాత‌ల‌కు డ‌బ్బులు చెల్లించ‌లేక‌పోయాడ‌ట‌. దాంతో ఇప్పుడు షోలు క్యాన్సిల్ అయ్యాయి. త‌మిళంలో సినిమా విడుద‌లైంది. కానీ తెలుగులో సింగం సంద‌డి లేదు. ప్ర‌స్తుతం చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉన్న ఈ సినిమా ఏ స‌మ‌యానికి విడుద‌ల‌య్యేది త్వ‌ర‌లోనే తెలుస్తుంది..

More News

వాటన్నింటికంటే ఉత్తమమైన కమిటీ ఇది : పరుచూరి వెంకటేశ్వరరావు

మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కమిటి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈసీ మెంబర్ల చివరి సమావేశం మంగళవారం హైదరాబాద్ బృగవాణి రిసార్స్ట్ లో జరిగింది.

తమిళనాట పరిస్థితులపై గొంతు విప్పిన గౌతమి

ప్రస్తుతం తమిళనాడులో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై నటి గౌతమి గొంతు విప్పారు. తమిళ ప్రజలు జయలలితను చూసి ఓట్లేశారు. కానీ కొందరు దొడ్డిదారిలో ఆ ఓటును అనుభవించడానికి ప్రయత్నిస్తున్నారు.

శ్రీను ఐ మిస్ యూ మూవీ లోగో, బ్యానర్ ,ట్రైలర్ లాంచ్

తోట మల్లికార్జున సమర్పణలో శ్రీ సూర్య నారాయణ క్రియేషన్స్ బ్యానర్ పై రాజేంద్ర ప్రసాద్ ను దర్శకుడి పరిచయం అవుతూ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ శ్రీను ఐ మిస్ యూ . శ్రీను నిర్మిస్తున్న ఈ చిత్రం లోగో , బ్యానర్ ,ట్రైలర్ లాంచ్ ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది.

మహా శివరాత్రి సందర్భంగా 'లక్ష్మీబాంబ్'

మంచు లక్ష్మీ ప్రసన్న టైటిల్పాత్రలో గునపాటి సురేష్ రెడ్డి సమర్పణలో ఉద్భవ్ ప్రొడక్షన్స్ బ్యానర్పై కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వంలో వేళ్ల మౌనిక చంద్రశేఖర్, ఉమా లక్ష్మీనరసింహ నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం 'లక్ష్మీబాంబ్`.

ఫిలిం జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తాం: డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి తలసాని

తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ (టీ.ఎఫ్.జె.ఎ) డైరీ ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం ఉదయం హైదరాబాద్ పిలింఛాంబర్ లో జరిగింది. ముఖ్య అతిధిగా విచ్చేసిన తెలంగాణ రాష్ర్ట సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ డైరీని ఆవిష్కరించారు.