సింగం - 3 టీజర్ కు 48 గంటల్లో 5 మిలియన్ వ్యూస్
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళం, తెలుగు భాషల్లో వరుస విజయాలతో మంచి క్రేజ్‌ను, మార్కెట్‌ను సంపాందించుకున్న వెర్సటైల్ కథానాయకుడు సూర్య కథానాయకుడిగా నటిస్తున్న తాజా ప్రతిష్టాత్మక చిత్రం సింగం-3. (ఎస్-3) తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్నారు. సింగం సిరీస్‌లో భాగంగా రూపొందుతున్న ఈ చిత్రానికి హరి దర్శకత్వం వహిస్తున్నారు. తమిళంలో స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్నారు. సురక్ష్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ఇక సింగం-3 తెలుగు, తమిళ భాషల్లో బాక్సాఫీస్ కొల్లగొట్టడానికి రెడీ అవుతున్నాడు. కాగా ఈ చిత్ర తమిళ, తెలుగు భాషల టీజర్‌ను ఇటీవల విడుదల చేశారు. కాగా ఈ చిత్ర తమిళ వెర్షన్ టీజర్‌తో పాటు తెలుగు వెర్షన్ టీజర్‌కు కూడా అద్భుత స్పందన లభిస్తోంది.సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి చిత్ర టీజర్ తర్వాత అత్యధిక వ్యూస్ సాధించిన టీజర్‌కు ఎస్-3 సరికొత్త రికార్డును నెలకొల్పింది. టీజర్ విడుదలైన 48 గంటల్లో ఎస్-3 టీజర్‌కు 5మిలియన్ వ్యూస్ సాధించింది.
ఈ సందర్భంగా నిర్మాత మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ: సూర్య కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం ఇది. మొదట్నుంచీ ఈ చిత్రానికి సంబంధించిన ఏ అంశమైనా అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తుంది. ఈ చిత్ర మోషన్ పోస్టర్, ఫస్ట్‌లుక్‌కు లభించిన స్పందనకు మించిన స్పందన టీజర్‌కు లభించడం ఆనందంగా వుంది. రూపొందుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకులకు వున్న అంచనాలను మించే విధంగా ఈ చిత్రం వుంటుంది. ఈ చిత్రంలో సూర్య నట విశ్వరూపం చూడబోతున్నారు. గతంలో సూర్య, హరి కాంబినేషన్లో రూపొందిన సింగం, సింగం-2 చిత్రాలకు మించిన విజయం ఈ చిత్రం సాధిస్తుంది. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రం ఆద్యంతం ఆసక్తికరమైన మలుపులతో సాగుతుంది. నీతినిజాయితీలే ఊపిరిగా భావించే ఓ పోలీస్ అధికారి వృత్తి నిర్వహణలో తనకు ఎదురైన సవాళ్లను ఎలా ఎదుర్కొన్నాడన్నదే ఈ చిత్ర ఇతివృత్తం. సూర్య నటన, పాత్ర చిత్రణ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. తెలుగు ప్రేక్షకుల్ని అలరించే ఈ నెలాఖరున చిత్ర గీతాల్ని విడుదల చేసి, డిసెంబర్ 16న తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అని తెలిపారు. రాధికా శరత్‌కుమార్, నాజర్, రాడాన్ రవి, సుమిత్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హేరీస్ జైరాజ్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments