సూర్య సింగం3 కొత్త రికార్డు

  • IndiaGlitz, [Saturday,July 16 2016]

సూర్య హీరోగా హ‌రి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న సింగం మూడో సీక్వెల్ ఎస్‌-3(సింగం3) సినిమా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. ఈ చిత్రం ఇటీవ‌ల వైజాగ్‌లో షూటింగ్ పూర్తి చేసుక‌ని చెన్నైకి బ‌య‌లుదేరింది. మ‌లేషియాలో లాస్ట్ షెడ్యూల్ జ‌ర‌గ‌నుంది. ఈ సినిమాను అక్టోబర్‌లో విడుద‌ల చేయాల‌ని చిత్ర‌యూనిట్ భావిస్తుంది. అయితే సినిమా చిత్రీక‌ర‌ణ పూర్తి కాక‌ముందే సినిమాపై భారీ క్రేజ్ నెల‌కొంది.

ఇప్ప‌టి వ‌ర‌కు త‌మిళంలో సూర్య సినిమాల‌కు ప‌లికిన ధర కంటే ఎక్కువ ఫ్యాన్సీ రేటుతో ఈ సినిమా థియేట్రిక‌ల్ హ‌క్కులు అమ్ముడైపోయాయ‌ట‌. దాదాపు 41 కోట్ల రూపాయలు చెల్లించి హ‌క్కులు సొంతం చేసుకున్నార‌ని టాక్‌. అలాగే తెలుగులో కూడా నైజాం, ఆంధ్ర‌లకు సంబంధించి 18 కోట్ల రూపాయ‌ల‌ ఫ్యానీ రేటు చెల్లించే నిర్మాత మ‌ల్కాపురం శివ‌కుమార్ హ‌క్కుల‌ను ద‌క్కించుకున్నాడ‌ని స‌మాచారం. ఈ విషయంపై నిర్మాత జ్ఞాన‌వేల్ రాజా చాలా హ్యాపీగా ఉన్నాడ‌ని కోలీవుడ్ వ‌ర్గాల సమాచారం.